ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మంత్రులు - అధికారులు - పార్టీనేతలతో తరచూ సమావేశమవుతుంటారన్న సంగతి తెలిసిందే. ఈ మీటింగుల్లో ఆయన తన స్టైలు మార్చారట. సమావేశం ప్రారంభం కాగానే అందరినీ ఉత్సాహపరిచి చివర్లో చీవాట్లు పెట్టి పంపిస్తున్నారట. రీసెంటుగా కజకిస్థాన్ - రష్యా దేశాల్లో పర్యటించి వచ్చిన తర్వాత చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తొలుత చంద్రబాబు సమావేశాన్ని హుషారెక్కించారట. నవ్వుతూ ప్రారంభించి.. తన పర్యటన విశేషాలను చెప్పగా అందరూ కాస్త ఈజీ అయ్యారట. ఆ తరువాత కృష్ణాపుష్కరాల ఏర్పాట్ల విషయం చర్చకొచ్చేసరికి చంద్రబాబులో అసలు మనిషి బయటకొచ్చేశాడట. తానెంతో ప్రతిష్టాత్మకంగా ఈ పుష్కరాల నిర్వహణకు ప్రయత్నిస్తుంటే శాఖల మధ్య సమన్వయం కొరవడిందంటూ ఒక్కొక్కరికి ఫుల్లుగా చీవాట్లు పెట్టారట.
మంత్రుల పనితీరు బాగులేదని కూడా చంద్రబాబు తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. పుష్కరాల పనులు ఏమాత్రం సక్రమంగా సాగడం లేదంటూ ఆయన ఫైరయ్యారు. ముఖ్యంగా ఘాట్ల నిర్మాణాన్ని మరింతవేగంగా చేయాలని సూచించారు. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో మంత్రులంతా కామ్ అయిపోయారు. అంతవరకు నవ్వుతూ నవ్విస్తూ ఉత్సాహపరిచిన సీఎం ఒక్కసారిగా సీరియస్ గా మారి చీవాట్లు పెట్టేసరికి ఎవరూ నోరెత్తలేకపోయారట.
కాగా ఇంతకుముందు చంద్రబాబు మీటింగుల్లో ఆయన చెప్పాల్సింది చెప్పేయడం.. ఆ తరువాత ఎవరినైనా ఏమైనా అనాల్సి ఉంటే అనేయడం అన్నట్లుగా ఉండేది. దీంతో మొదటి నుంచి కూడా ఎవరూ ఎక్కువగా మాట్లాడే పరిస్థితి ఉండేది. ఒన్ వే కమ్యూనికేషన్ లా ఆ మీటింగులు సాగేవి. అయితే.. ఇప్పుడు చంద్రబాబు మీటింగు ప్రారంభంలో హుషారుగా ఉంటుండడంతో అంతా ఫ్రీ అయి అనేక అంశాలను చర్చకు తెస్తున్నారట. కానీ.. చివర్లో మాత్రం చంద్రబాబుతో అక్షింతలు వేయించుకుని వాడిపోయిన ముఖాలతో బయటకు వస్తున్నారట. ఇది గ్రహించిన కొందరు మంత్రులు మాత్రం ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ మీటింగుల్లో చంద్రబాబు వైపే చూస్తూ ఆయన చెప్పిందంతా సావధానంగా విన్నట్లు నటిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మెల్లగా బయటపడుతున్నారట.