రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబే కారణమంటూ అంతా ఆరోపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. తొక్కిసలాటకు ముందు చంద్రబాబు గోదావరిలో స్నానం చేస్తుండగా... పూజలు చేస్తుండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో షూటింగ్ చేస్తున్నట్లుగా ఆ ఫొటోలో ఉంది. ఇది పెను దుమారానికి కారణమవుతోంది. బోయపాటి శ్రీను దర్సకత్వంలో చంద్రబాబు పుష్కరాల నేపథ్యంలో షార్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ చిత్రీకరిస్తుండడం వల్లే అక్కడ భక్తులను రెండు గంటల పాటు ఉంచేశారని... అదే తొక్కిసలాటకు కారణమని ఆరోపణలు మరింత పెరుగుతున్నాయి.
గోదావరి పుష్కరాలను మహా కుంభమేళాను తలదన్నేలా నిర్వహించామని చెప్పుకోవడానికి.... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం చేసుకోవాలని... అది తనకు ప్రచారానికే కాకుండా ఏపీ టూరిజం అభివృద్ధికీ ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ డాక్యుమెంటరీకి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
అదేసమయంలో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కోసం కూడా ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేశారని సమాచారం. ఈ మేరకు పుష్కర స్నానాలప్రారంభం, సిఎం కుటుంబ సభ్యులు పుణ్య స్నానాలు, లక్షలాది భక్తుల హాజరు, ఘాట్లలో హడావిడి అన్ని కలిపి ఓ డాక్యుమెంటరీ తీసి విదేశీ ప్రతినిధులకు చూపించి ఖ్యాతి పొందాలని చంద్రబాబు భావించారని ఓ పత్రికలో కథనం కూడా వచ్చింది.
ఈ చిత్రం, డాక్యుమెంటరీలను దృష్టిలో ఉంచుకునే ఆయన గోదావరి హారతి కార్యక్రమంతో పాటు లేజర్ షోలు, ఇతర ఆర్భాటాలకు ప్లాన్ చేశారని అంటున్నారు. తొక్కిసలాట ఘటన చోటుచేసుకోకపోతే పుష్కరాల 12 రోజులూ చంద్రబాబు షూటింగులకే సరిపోయేదన్న విమర్శలూ వస్తున్నాయి. కాగా డాక్యుమెంటరీ ముహూర్తపు షాట్‌గా పుష్కరాల ముందు రోజైన సోమవారం రాత్రి పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి నిర్వహించిన గోదావరి నిత్యహారతిని షూట్ చేశారు. ఇది బోయపాటి డైరెక్షన్‌లో తీశారు. తొక్కిసలాటకు కారణాలేమైనా కానీ పుష్కరాలపై చంద్రబాబు పాత్రధారిగా డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిగిందనడం ఖాయం... అందుకు బోయపాటి డైరెక్షన్ చేశారన్నదీ ఖాయం. ఆ చిత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. పాపం .... చంద్రబాబు ఏం చేసినా చినిగి చాటవుతోంది