వివాదాస్పద వ్యక్తి ఎమ్మెల్సీ టిక్కెటిచ్చిన బాబు

Update: 2017-02-28 07:38 GMT
ఏపీ టీడీపీలో ఎమ్మెల్సీ టిక్కెట్లు పార్టీలో అసంతృప్తి కుంపట్లను రాజేస్తున్నాయి. అంతేకాదు.. టిక్కెట్లు వచ్చిన వారి బండారాలను మిగతా నేతలు బయటపెడుతూ.. వారికి టిక్కెటిచ్చిన చంద్రబాబును కూడా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డికి టిక్కెట్ ఇవ్వడం దుమారం రేపుతోంది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి చేరారు. తొలి నుంచి ఆయనకు టిక్కెట్ గ్యారంటీ అనే వినిపిస్తోంది. మొదట్లో ఆయన అభ్యర్థిత్వంపై వ్యతిరేకత లేకున్నా గత ఏడాది చివర్లో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు పరిస్థితులను ఒక్కసారిగా మార్చేశాయి. ఆయనకు టిక్కెటివ్వొద్దంటూ టీడీపీలోనే పలువురు నేతల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి వచ్చింది అయితే.. చంద్రబాబు మాత్రం వారందరి మాటలను పక్కనపెట్టి వాకాటికే ఛాన్సిచ్చారు.
    
వాకాటి నారాయణరెడ్డి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పరారయ్యారని గత ఏడాది ఆరోపణలు వచ్చాయి.  ఏకంగా 720 కోట్ల మేరకు బ్యాంకులకు ఎగ్గొట్టారని... బ్యాంకుల నుంచి ఒత్తిడి రావడంతో పరారయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది.     పారిశ్రామికవేత్త అయిన నారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఆ తరువాత టీడీపీలో చేరారు. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ఆయన భారీగా రుణాలు తీసుకున్నారట. వాటిని కొద్ది నెలలుగా చెల్లించకపోవడంతో వారంతా ఆయన కోసం వెతికారని టాక్.   ఒక్క స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకే ఆయన ఏకంగా 203కోట్లు తిరిగి చెల్లించాలట. దీంతో ఆ బ్యాంకు బహిరంగ ప్రకటన కూడా జారీ చేసింది.
    
అయితే.. వాకాటికి రాష్ ట్రంలో పేరుమోసిన సంస్థలున్నాయి. వీఎన్ ఆర్ ఇన్ ఫ్రా - లాజిస్టిక్సు - పవర్ టెక్ - అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ వంటి సంస్థలున్నాయి.  బడా పారిశ్రామికవేత్త అయిన వాకాటి ఆర్థిక సంస్థలను మోసగించిన కేసుల్లో నిందితుడని.. ఆయనకు టిక్కెట్ ఎలా ఇస్తారని స్థానిక నేతలు గళం విప్పుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News