ప్రస్తుతం జనసేన తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉన్న లక్ష్మినారాయణను ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఎంతగా నెత్తికి ఎత్తుకుందో తెలిసిన సంగతే. జగన్ కేసును సీబీఐ జేడీగా ఆయన విచారిస్తున్నప్పుడు ఆయనను ఒక హీరోలా చూసింది తెలుగుదేశం పార్టీ. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేశారు. ఆయనను కీర్తిస్తూ ఒక రేంజ్ లో భజన చేశారు.
లక్ష్మినారాయణ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారంటే అందులో అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆయనపై సృష్టించిన హైపే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. జగన్ మోహన్ రెడ్డి పై లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సీబీఐ నమోదు చేసిన వివిధ సెక్షన్ల కేసులో కోర్టులో వీగిపోయాయి. అది వేరే సంగతి. ఇక వీఆర్ ఎస్ తీసుకుని లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వచ్చేశారు.
ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రకటన చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. లక్ష్మినారాయణ తమ పార్టీలోకి వచ్చి చేరాలని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన తెలుగుదేశంలో చేరతారని - భీమిలి నుంచి పోటీ చేస్తారని ఇటీవలే ప్రచారం జరిగింది కూడా. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతే అది జగన్ కు మేలు జరిగేది అవుతుందనే లెక్కతో ఆ చేరిక ఆగిందని అంటారు.
కట్ చేస్తే లక్ష్మినారాయణ జనసేనలోకి చేరి విశాఖ ఎంపీ టికెట్ ను టక్కున తెచ్చేసుకున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ అల్లుడు భరత్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను గెలిపించుకునేందుకు బాబు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణను బాబు ఏమీ విమర్శించలేదు కానీ, ఆయనకు ఓటు వేయొద్దని మాత్రం అన్నారు. ఆయనకు ఓటేస్తే అది వేస్ట్ అవుతుందని కూడా అన్నారు.
అంటే జనసేన తరఫున లక్ష్మినారాయణ ఎలాగూ గెలవలేరు కాబట్టి - ఆ ఓటేదో తెలుగుదేశానికి వేయాలని బాబు పిలుపునిచ్చారు. మరి మొన్నటి వరకూ తెలుగుదేశం వారు హీరోగా చూపిన లక్ష్మినారాయణకు ఓటు వేయొద్దని తెలుగుదేశం పార్టీ అధినేతే పిలుపునివ్వడమే రాజకీయం!