తిరుపతి ఉపఎన్నికతో టీడీపీ భవిష్యత్తు తేలిపోతుందా ?

Update: 2020-12-11 16:07 GMT
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలుపును చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లున్నారు. తాజాగా చంద్రబాబు మాట్లాడిన మాటలు విన్న తర్వాత తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో తెలుగుదేశంపార్టీ భవిష్యత్తు తేలిపోయేట్లే ఉంది. ఎందుకంటే తిరుపతి ఉపఎన్నికలో గెలవటం టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఒక ఉపఎన్నికలో గెలుపోటములు పార్టీ భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయిస్తాయని అనుకున్నారో చంద్రబాబుకే తెలియాలి.

నిజానికి తిరుపతి ఉపఎన్నికలో గెలుపుకు, పార్టీ భవిష్యత్తుకు ముడిపెట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేతలకు తప్పుడు సంకతాలు పంపారనే అనుకోవాలి. ఎందుకంటే 1982లో టీడీపీ పెట్టినప్పటి నుండి లెక్క తీసుకుంటే పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక ఎన్నికలో మాత్రమే. 1984 లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ చింతామోహన్ టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. మళ్ళీ తర్వాత పార్టీ ఇక్కడ గెలిచిందే లేదు. కొన్నిసార్లు పార్టీయే పోటీ చేసినా మరి కొన్నిసార్లు పొత్తుల్లో ఇతరులకు వదిలేసినా గెలుపు మాత్రం దక్కలేదు.

పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ చాలా బలహీనంగా ఉందన్న మాట వాస్తవం. ఆ విషయం చంద్రబాబు కూడా బాగా తెలుసు. ఎన్నికకో అభ్యర్ధితో పోటీ చేయించటంతోనే పార్టీ దెబ్బతినేసింది. పైగా పనబాక లక్ష్మి అభ్యర్ధిత్వంపై తిరుపతిలోని చాలామంది నేతలు సానుకూలంగా లేరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పైగా వైసీపీ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తి అభ్యర్ధిత్వంపై సానుకూలంగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు 2.28 లక్షల మెజారిటి వచ్చింది.

అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల అంతకుమించి మెజారిటి రావాలన్నది జగన్మోహన్ రెడ్డి భావనట. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు కూడా అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే జగన్ పై వ్యతిరేకత చంద్రబాబు చెబుతున్నంతగా లేదు. జగన్ పై వ్యతిరేకతంతా చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియాలో మాత్రమే కనబడుతోంది. పైగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ప్రతి 10 శాతం ఓట్లలో 5 శాతం టీడీపీకి పడాలట. 5 శాతం ఓట్లు వైసీపీ నుండి టీడీపీకి మళ్ళటం మామూలు విషయం కాదు.

అయినా వైసీపీ ఓట్లు ఎందుకు మళ్ళాలో మాత్రం చంద్రబాబు చెప్పటం లేదు. ఎంతసేపు జగన్ పై జనాల్లో వ్యతిరేకత వచ్చేసిందని మాత్రమే చెబుతున్నారు. తిరుపతి ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. అంత చారిత్రక అవసరం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారని చెప్పటం కూడా విచిత్రమే. అదే నిజమైతే వైసీపీకి 151 సీట్లు ఎందుకొస్తుంది ? మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల నామినేషన్లలో కూడా చాలా చోట్ల టీడీపీ నేతలు అసలు నామినేషన్లే వేయలేకపోయారు. చంద్రబాబు పుట్టి పెరిగిన నారావారిపల్లె లో కూడా టీడీపీ నామినేషన్ వేయలేదంటే అర్ధమేంటి ?
Tags:    

Similar News