త‌మ్ముళ్లూ...మోడీని కెల‌కద్దంటున్న బాబు

Update: 2017-05-18 07:53 GMT
బీజేపీతో దోస్తీ ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర  మోడీతో స‌ఖ్య‌త విష‌యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. త‌న అవ‌స‌రాల కార‌ణంగా న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ ప్ర‌యోజ‌నాల కంటే మోడీకి మ‌ద్ద‌తివ్వ‌డానికే బాబు ప్రాధాన్యం ఇచ్చార‌నే విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే చేసిన సంద‌ర్భాలు ఉండ‌నే ఉన్నాయి. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ- వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి భేటీపై తెలుగుదేశం పార్టీ నేత‌ల అత్యుత్సాహం చంద్ర‌బాబును ఇబ్బందుల్లో ప‌డేసిన‌ట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌ధానితో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అవ‌డంపై తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేస్తూ ఒక క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాదికి ప్రధానికి ఎలా అపాయింట్‌ మెంట్ ఇస్తారంటూ నిలదీశారు. అంతేకాకుండా బీజేపీ-జగన్ కలిస్తే మాకే లాభమంటూ కొందరు ఎమ్మెల్సీలు చేసిన బహిరంగ ప్రకటనలు బాబు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు తెలిసింది. స‌ద‌రు ప్ర‌క‌ట‌న టీడీపీ-బీజేపీ బంధానికి విఘాతం కలిగేలా స్థాయికి చేరిన నేప‌థ్యంలో దీనిపై దిద్దుబాటుకు దిగిన  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలకు హెచ్చరికలు జారీ చేసినట్లు స‌మాచారం. తాజాగా జ‌రిగి మంత్రివర్గ సమావేశంలో కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారనే విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

విశ్వసనీయవ‌ర్గాల‌ సమాచారం ప్రకారం.. మోడీపై మంత్రులు - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఈ విషయంలో ప్రధాని గురించి మట్లాడాల్సిన అవసరం లేదు. నేను సీఎంగా ఉన్నా కాబట్టి చాలామంది నన్ను కలుస్తుంటారు. అలాగే ఆయన ప్రధాని కాబట్టి కలుస్తారు. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. కాకపోతే జగన్‌ ను ఎందుకు కలిశారని ప్రశ్నించండి తప్ప, మోడీ గురించి మాట్లాడవద్దు’ అని చంద్ర‌బాబు ఆదేశించిన‌ట్లు టీడీపీ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ ప్ర‌చారం సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News