స్కూల్ టీచ‌ర్ లా మారిన చంద్ర‌బాబు

Update: 2017-11-10 06:48 GMT
ఎమ్మెల్యేల‌కు.. ఎమ్మెల్సీల‌కు త‌న మాట‌ల‌తో చుక్క‌లుచూపిస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. రోజుకో రూల్ తెర మీద‌కు తెస్తున్న ఆయ‌న తీరుతో ప్ర‌జాప్ర‌తినిధులు మింగా లేక క‌క్కాలేక కిందామీదా ప‌డుతున్నారు. గ‌తానికి భిన్నంగా ఇప్పుడుగ్రేడ్లు.. ర్యాంకుల‌ని చెబుతూ అంకెల‌తో వ‌ణుకు పుట్టిస్తున్న చంద్ర‌బాబు.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాల వేళ మ‌రింత క‌ఠినమైన రూల్స్ పెట్ట‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌న్న‌ది తాజా ఆర్డ‌ర్‌. ఎందుకంటే అధికార‌ప‌క్షం.. ప్ర‌తిప‌క్షం పాత్ర‌ను మ‌న‌మే పోషించాల‌ని బాబు కోరుకుంటున్నారు. నిజ‌మే.. బాబు అనుకోవ‌టంలో త‌ప్ప లేదు. ఎందుకంటే బాబు బాధ బాబుది. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే వేళ‌.. విప‌క్షం లేక‌పోవ‌టంతో స‌భ డ‌ల్ గా ఉంటుంది. ఇదో కొర‌త అయితే.. అధికార‌ప‌క్ష నేత‌లు స‌భ‌లో లేకుండా అసెంబ్లీలో చిట్ చాట్ చేయ‌టానికి బ‌య‌ట‌కు వెళ్లితే.. స‌భ‌లో స‌భ్యులు క‌నిపించ‌రు.

స‌ర్లే.. దాన్ని భ‌రిద్దామంటే.. అసెంబ్లీ లైవ్ కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల్లోకి వెళుతుంది. ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌టంతో స‌భ చ‌ప్ప చ‌ప్ప‌గా సాగుతుంద‌న్న సందేశం వెళ్లిదంటే అంతిమంగా న‌ష్ట‌పోయేది అధికార‌ప‌క్ష‌మే. మ‌రి.. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే స‌భ క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండాలి. అలా ఉండాలంటే.. క‌చ్ఛితంగా స‌భ‌లో అధికార‌ప‌క్ష నేత‌లు నిండుగా క‌నిపించాడు. కెమేరా కంటికి స‌భ నిండుగా ఉంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లిగేలా చేస్తే బాబు మీద స‌గం భారం త‌గ్గుతుంది. అందుకే.. బాబు టీచ‌ర్ లా మారిపోయారు.

అసెంబ్లీ జ‌రిగే ఐదు గంట‌లు రాముడు మంచిబాలుడు టైప్ లో.. గుడ్ స్టూడెంట్ పాత్ర పోషించాల‌ని భావిస్తున్నారు. అలా ఆయ‌న అనుకుంటేనే త‌మ్ముళ్లు చేసేయ‌రు క‌దా. అందుకే.. త‌మ్ముళ్ల‌కు భారీ ఆర్డ‌రే వేసేశారు. స‌భలో అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని.. బ్రేక్ లో త‌ప్ప విడిగా బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌న్న ఫ‌ర్మానా జారీ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఆరోగ్యం స‌రిగా లేని నేత‌లు.. పెద్ద వ‌య‌స్కులకు మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే ఇబ్బందుల గురించి బాబు ఏమైనా ఆలోచించారు. క‌ద‌ల‌కుండా కుదురుగా ఐదు గంట‌ల పాటు అసెంబ్లీలో కూర్చోవ‌టం అంటే తెలుగు త‌మ్ముళ్ల‌కు పెద్ద ప‌నిష్మెంటే. ప్ర‌భుత్వ ఇమేజ్‌కాపాడుకోవ‌టానికి.. ఆ మాత్రం ప‌నిష్మంట్ త‌మ్ముళ్ల‌కు త‌ప్ప‌దేమో?
Tags:    

Similar News