తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకుల మీద ఎంతటి తీవ్రమైన ఆరోపణలు అయినా చేసి ఉండవచ్చు గాక.. దానికి ప్రతిస్పందనగా.. ఏపీ నాయకులు ఎవ్వరూ రేవంత్ రెడ్డి మీద మాత్రం తిరిగి నిందలు వేయడానికి - తిట్టడానికి - కనీసం ఆయన ఆరోపణలు అసత్యాలు అని చెప్పడానికి కూడా వీల్లేదు. రేవంత్ విషయం ఎవ్వరి ఎదుట ప్రస్తావనకు వచ్చినా సరే.. మౌనం పాటించాల్సిందే.. ఆవిషయాన్ని దాటవేయాల్సిందే. ఈ మేరకు పార్టీ నాయకులు అందరికీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున హుకుం జారీ అయింది. ప్రత్యేకించి మీడియాతో మాట్లాడేప్పుడు.. రేవంత్ గురించి ఎలాంటి కామెంట్లు చేయరాదని పురమాయింపు ఉన్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రచ్చరచ్చగా అవుతోంది. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం ఎంత రసాభాస అయిందో అందరికీ తెలుసు. అయితే తెలంగాణ తెదేపా నాయకులు మాత్రం విడివిడిగా రేవంత్ మీద విమర్శలు కురిపించారు. నిజానికి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తెతెదేపా నాయకులు వారిలో వాళ్లు ఎలా తిట్టుకున్న పర్వాలేదు. కానీ ఏపీ నాయకులు మాత్రం.. రేవంత్ విమర్శలకు స్పందించడానికి లేదు అన్నదే ఆదేశం.
చంద్రబాబునాయుడు.. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని పూర్తిగా తెలంగాణ లోకల్ ఎఫైర్ గా కలర్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ అభిజ్ఞవర్గాల్లో వినిపిస్తున్న వాదన మరో రకంగా ఉంది.
రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటే.. అది తెతెదేపా మీద చాలా నెగటివ్ ప్రభావ చూపిస్తుందనే ఆందోళనకంటె.. ఆయన భవిష్యత్తులో ఎక్కడ ఓటుకు నోటు గురించి మాట్లాడుతాడో అనే భయం చంద్రబాబు లో అధికంగా కనిపిస్తున్నదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ నోరు విప్పితే గనుక.. చంద్రబాబు చాలా ఇరకాటం తప్పదు. అందుకే రేవంత్ తో మంచిగా ఉండడానికే ఆయన ఇష్టపడుతున్నారని, రేవంత్ మనసు నొచ్చుకునేలా..తన పరిధిలోని ఏపీ నాయకులు ఎవ్వరూ మాట్లాడకుండా చూసుకుంటున్నారని కూడా పలువురు అంటున్నారు. ఇక తెలంగాణ తెదేపా విషయానికి వస్తే.. వారు ఎలా పోయినా పర్లేదనే ఉద్దేశంతో అధినేత ఉన్నారు గనుక.. తగాదాను వారి పర్సనల్ ఎఫైర్ గా గుర్తింపు తేవడానికి చూస్తున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడు వచ్చే దాకా ఆగదలచుకున్నారు గానీ.. ఆలోగానే విదేశాల్లో తిరుగుతున్న చంద్రబాబుకు చెమట్లు పట్టిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.