ఎంతటి పోటుగాడైనా తనను తాను పొగుడుకోవటం కనిపించదు. తన చుట్టూ ఉన్నోళ్ల చేత పొగిడించుకుంటారు. ఒకవేళ..వాళ్లకు పొగడటం చేతకాకపోతే.. చెప్పి నేర్పించుకుంటారు. అదేం సిత్రమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు భిన్నం. ఆయన్నుఎవరూ పొగడనక్కర్లేదు. తనను తానే తెగ పొగిడేసుకుంటారు. ఇలాంటి సిత్రమైన చిన్నెలు బాబులోనే కాదు.. ఆ పార్టీలోని నేతల్లోనూ కనిపిస్తుంది.ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో తెలుగు తమ్ముడు ఒకరు బీకామ్ లో ఫిజిక్స్ చదివేసి పాస్ అయినట్లుగా చెప్పేసి.. తెలుగు ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేని కమ్మటి జోకును మిగిల్చారు. ఆయన ముచ్చటను పక్కన పెట్టేసి.. బాబుగారి మాటల్లోకి వెళితే.. తాజాగా తనను తాను పొగిడేసుకునే ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నారు.
తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో కొనసాగుతున్నట్లుగా చెప్పిన ఆయన.. రాష్ట్రం విడిపోయి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాట పట్టించేందుకు బస్సు నుంచే పాలించినట్లుగా చెప్పుకున్నారు. దేశంలో తానే అత్యంత సీనియర్ ను అని పొగిడేసుకున్నారు.
ఐకే గుజ్రాల్.. వాజ్ పేయ్ ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు దేశంలో ఎవరూ లేరన్న చంద్రబాబు కొన్నిపాయింట్లు మిస్ అయ్యారు. మరింత అనుభవం ఉన్న నేత మాటల్ని ప్రధాని మోడీ ఎందుకు నో చెప్పేస్తున్నారు? అప్పుడెప్పుడోనే కేంద్రప్రభుత్వాల్లో చక్రం తిప్పిన పెద్ద మనిషి.. ఇప్పుడెందుకు తిప్పలేకపోతున్నారు.
కేంద్రం చక్రం దాకా ఎందుకు? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంటు సాక్షిగా ప్రధాని చెప్పిన మాటల్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? దేశంలోనే ఎవరికి లేనంత అనుభవం ఉన్నట్లైతే.. హోదా విషయంలో మోడీ మాటకు ఎందుకు రాజీ పడాల్సి వచ్చింది? మరింత అనుభవం ఉన్న నేతకు..విభజన సమయంలో జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసే ప్రయత్నం చేసినప్పుడు.. కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వని వైనాన్ని మర్చిపోయారా? విభజన జరిగినమూడేళ్ల తర్వాత కూడా ఆంధ్రోళ్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేయటం.. ఉమ్మడి రాష్ట్రంలో మోసం చేశామనటం.. అన్యాయానికి పాల్పడినట్లుగా చెప్పటంపై ఇంతవరకు సరైన సమాధానం ఎందుకు చెప్పనట్లు? సీనియార్టీ గొప్పలు ప్రజలు చెప్పుకోవాలే కానీ.. బాబే చెప్పుకోవటం బాగోదన్న విషయం తెలిసేదెప్పుడు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/