బాబు ఐడియా..గడ్కరీకి టీడీపీ మీడియా సపోర్ట్

Update: 2018-12-31 04:59 GMT
బాబుతో అన్నేళ్లు సహవాసం చేసిన కేసీఆర్ కు ఆయన గుట్టుమట్లు - శక్తిసామర్థ్యాలు అన్నీ తెలుసు. అందుకే చంద్రబాబును మేనేజర్ అని సంభోదించారు. తిమ్మినిబమ్మి చేయడంలో బాబుది అందవేసిన చేయి. మీడియా మేనేజ్ మెంట్ లో గురుగా పేరొందారు. అందుకే అస్సలు హైప్ లోని కాంగ్రెస్ ను తెలంగాణలో గెలుస్తుందంటూ ఒకనొక దశలో టీఆర్ ఎస్ కే గుబులు పుట్టించారు. అక్కడ వర్కవుట్ కాలేదు.. ఇప్పుడు రాహుల్ పంచన చేరారు. ఆయన వీరుడు - శూరుడు అంటూ తన మీడియాలో హైప్ ను తెచ్చే పనిలో పడ్డారు. కానీ దేశవ్యాప్త సర్వేలో ఈసారి కాంగ్రెస్ కు 100 సీట్లు రావని.. బీజేపీ అధికారంలోకి రావడానికి కొద్దిదూరంలో ఆగిపోతుందని అన్ని సర్వేల్లో తేలుతోంది. దీంతో చంద్రబాబు ఇప్పుడు ప్లాన్ బీని అమలు చేసే పనిలో పడ్డారట..

తాజాగా టీడీపీ అనుకూల మీడియా బీజేపీ సీనియర్ నేత - కేంద్రమంత్రి గడ్కరీ వెంట పడుతోంది. వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే మోడీ స్థానంలో గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ఆర్ ఎస్ ఎస్ ప్రకటిస్తుందని టీడీపీ అనుకూల మీడియా పదిరోజులుగా కథనాలతో స్లో పాయిజన్ లో జనాలకు ఎక్కిస్తోంది. బీజేపీ అంటే ద్వేషంతో రగిలిపోతున్న బాబు ఇప్పుడు గడ్కరీని తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటన్న సందేహాలు అందరిలోనూ నెలకొంటున్నాయి.

టీడీపీ అనుకూల మీడియా.. గడ్కరీకి హైప్ తెచ్చి మోడీషాలను దెబ్బ తీసే స్కెచ్ కు బాబు డైరెక్షన్ ఇస్తున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకే పరిమితమవుతాడని అంచనాలుండడం.. అఖిలేష్-మాయవతి - మమతలు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండడంతో చంద్రబాబు తన పంథా మార్చేశాడని అర్థమవుతోంది. ఢిల్లీలో చంద్రబాబు తరుఫున లాబీయింగ్ చేసే వ్యక్తులు ఇప్పుడు బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ తో టచ్ లోకి వెళ్లారట.. మోడీ - అమిత్ షాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని.. హంగ్ వస్తే మోడీ కాకుండా మరొకరిని ప్రధానిగా ప్రకటిస్తామంటే ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు టీడీపీకి అభ్యంతరం లేదన్న మెసేజ్ ను ఆర్ ఎస్ ఎస్  పెద్దలకు చేరవేశారట..

అందువల్లే ఇప్పుడు గడ్కరీ పైనే టీడీపీ అనుకూల మీడియా ప్రేమ కురిపిస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబుతో గడ్కరీకి మంచి సంబంధాలున్నాయి. పోలవరం విషయంలో కూడా గడ్కరీ చంద్రబాబుకు ఉదాసీనంగా వ్యవహరించారు. కేంద్ర జలవనరుల శాఖమంత్రిగా పోలవరం అవినీతి విషయంలో గడ్కరీ పెద్దగా పట్టించుకోలేదు. చూసీ చూడనట్టు వదిలేశారు. నష్టపరిహారం చెల్లింపులో అవినీతి జరిగినా గడ్కరీ చర్యలు తీసుకోలేదు. దీంతో అన్నివిధాలా గడ్కరీ మేలు అనుకొని బాబు బీజేపీ స్టాండ్ తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ ఎలాగూ రాదని తెలుసుకొని బీజేపీ-గడ్కరీ లీడర్ షిప్ కు బాబు ఓకే అన్నట్టు లీకులు పంపిస్తున్నారు. దీన్ని బట్టి ఈసారి ఆటలో అరటిపండుగా మరోసారి చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ పార్టీ - రాహుల్ గాంధీ మోసపోవడం ఖాయంగా కనిపిస్తోంది.


Full View

Tags:    

Similar News