ఇద్ద‌రు చంద్రుళ్లు..జ‌గ‌న్..జానాల మ‌హా భేటీ

Update: 2017-07-03 04:50 GMT
రాజ‌కీయాల్లో ఏదీ అసాధ్యం కాద‌ని చెబుతారు. ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని చెబుతుంటారు. నిజానికి ఈ మాట‌ల్లో ఎంతో నిజం ఉంది. రాజ‌కీయాల్లో శాశ్విత మిత్రులు కానీ శాశ్విత శ‌త్రువులు కానీ అస్స‌లు ఉండ‌దు. ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గున మండే నేత‌లు సైతం.. ఒక‌రినొక‌రు క‌లిసిన‌ప్పుడు క‌లివిడిగా మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తుంది. అదే రాజ‌కీయాల స్పెషాలిటీగా చెప్ప‌క త‌ప్ప‌దు.

త్వ‌ర‌లో ఓ ఆస‌క్తిక‌ర భేటీ జ‌ర‌గ‌నుంది. భిన్న ధ్రువాలైన అధినేత‌లు ఒకే వేదిక మీద‌కు రావ‌ట‌మే కాదు.. చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు దాటుతున్నా.. నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చాలానే విభేదాలు ఉన్నాయి. ప్రాజెక్టుల నీటి పంపిణీ మొద‌లు.. చాలానే లిస్ట్ ఉంది. అయితే.. ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మీద రెండు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అధికారికంగా ఒక భేటీ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కృష్ణా జ‌లాల పంపిణీకి సంబంధించిన ఇష్యూల‌ను క్లోజ్ చేయాల‌ని న‌ర‌సింహ‌న్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల‌కు చెందిన అధికార‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని ఒక చోట కూర్చొబెట్టి వారి మ‌ధ్య‌న ఉన్న అభిప్రాయ భేదాల్ని తెలుసుకోవ‌టం..ఇరువురి మాట‌ల్ని విని.. స‌మ‌స్య ప‌రిష్కారం మీద దృష్టి పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ భేటీలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు.. కేసీఆర్ ల‌తో పాటు.. రెండు రాష్ట్రాల ప్ర‌తిప‌క్ష నేత‌లు జానారెడ్డి.. జ‌గ‌న్ లను గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగే ఈ బిగ్ భేటీ ద్వారా కృష్ణా జ‌లాల పంచాయితీని ఒక కొలిక్కి తేవాల‌ని గ‌వ‌ర్న‌ర్ భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఈ భేటీని ఆగ‌స్టులో నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న పంచాయితీల లెక్క తేల్చేందుకు భేటీ జ‌రిగితే.. అంత‌కు మించి కావాల్సిందేముంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News