ఆదివారం రోజు అమరావతి కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకోండి...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీలతో సమావేశం ప్రారంభించిన తర్వాత.. తొలుత అది హాట్ హాట్ గానే సాగుతూ వెళ్లింది. తెగతెంపులు తప్ప తమ వద్ద మరో ప్రత్యామ్నాయం లేదన్నట్లుగానే అందరి వాదనగా ఆ సమావేశం వేడెక్కింది. అంతలో రాజ్ నాధ్ సింగ్ నుంచి ఫోను వచ్చింది. సమావేశం ముగిసిన తర్వాత.. ఎంపీలు బయటకు వచ్చి.. ఎలాంటి నిర్దిష్టత లేకుండా పోరాటం సాగిస్తాం.. అంచెలంచెలుగా మా పోరాటం ఉంటుంది. రాష్ట్రానికి రావాల్సినవి మొత్తం సాధిస్తాం.. అని మాత్రమే వారు సెలవిచ్చారు. వారి తీరు చూస్తే ఉధృతమైన పోరాటం జరుగుతుందనే సూచన ఎంతమాత్రమూ కనిపించలేదు. మిత్రధర్మం ముసుగులో మెతకధోరణి - పలాయనవాదం తెలుగుదేశానికి మామూలే అని అంతా సర్దుకున్నారు.
సోమవారం నాడు...
ఉదయమే చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటులో తమ పోకడ - నిరసన ఎలా ఉండాలో వారికి దిశానిర్దేశం చేశారు. అంతే.. పార్లమెంటు పరిణామాలు అనూహ్యంగా మొదలయ్యాయి. తెలుగుదేశం ఎంపీలు దశల సంగతి తర్వాత.. కాస్త జోరుగానే నిరసన వెలిబుచ్చడం ప్రారంభించారు. ఈ దూకుడు ఆదివారం నాడు వారి మాటల్లో కనిపించలేదు.
అంటే ఆదివారం రోజు రాత్రికి రాత్రే ఏదో అబ్రకదబ్ర జరిగిందని పలువురు అనుమానిస్తున్నారు.
చంద్రబాబునాయుడు ఆదివారం నాడు సాయంత్రానికి నిర్ణయించిన యాక్షన్ ప్లాన్ కు పూర్తి భిన్నంగా.. కేంద్రాన్ని చికాకు పెట్టే రీతిలో ఇంచుమించుగా ప్రతిపక్ష పార్టీలు పోరాడినస్థాయిలో తెలుగుదేశం పోరాటం సాగిస్తోంది. మంగళవారం నాటి మధ్యాహ్నానికైతే.. తెదేపా ఎంపీలతో చర్చించడానికి అరుణ్ జైట్లీ - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలిచినా కూడా ఎంపీలు వెళ్లలేదంటే.. వీరు సీరియస్ గానే ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ పరిణామాల సంకేతాలు ఇంకా తీవ్రమైన పర్యవసానాన్నే సూచిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు.
ఆదివారం రాత్రి చంద్రబాబునాయుడు ఏదో కీలక నిర్ణయం తీసుకున్నారని... ఆ నిర్ణయం జాతీయ రాజకీయాలను కుదుపు కుదిపేదిగా ఉండవచ్చునని కూడా పలువురు అనుమానిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఆయనేమైనా రంగం సిద్ధం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా తెదేపా దూకుడు చూసిన వారికి కలుగుతున్నాయి.