సినిమా టికెట్ కొన్న చంద్రబాబు

Update: 2016-06-06 11:57 GMT
ఏపీ రాజధాని బెజవాడ మరో చరిత్ర సృష్టిచింది. దేశంలో మరెక్కడా లేని ఒక ఘనతను సాధించింది. బస్టాండ్ అన్న వెంటనే గుర్తుకు వచ్చే వాతావరణానికి భిన్నంగా ఉండే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ట్ స్టేషన్ కు తగ్గట్లే తాజాగా మణిపూస లాంటి సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్టాండ్లలో మల్టీఫ్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రూపం ఇస్తూ..తొలి మల్టీఫ్లెక్స్ ను ఏర్పాటు చేశారు.

వై స్క్రీన్ సంస్థ వెయ్యి మినీ థియేటర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే.  అందులో భాగంగా తొలి మల్టీఫ్లెక్స్ ను బెజవాడ బస్టాండ్ లో ఏర్పాటు చేశారు. తాజాగా ఈ మల్టీఫ్లెక్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపెన్ చేశారు. లగ్జరీ సీట్లలో ఉన్న ఈ మినీ థియేటర్లు బస్సుల కోసం వెయిట్ చేసే ప్రయాణికులకు మరింత వినోదంగా మార్చటంతో పాటు.. బస్టాండ్లను కళకళలాడేలా చేస్తాయన్న వాదన వినిపిస్తోంది. దేశంలోనే తొలి మల్టీఫ్లెక్స్ ఉన్న బస్టాండ్ గా చరిత్రలోకి ఎక్కిన బెజవాడ.. రానున్న రోజుల్లో మరెన్ని ఘనతల్ని తన పేరిట రాసుకుంటుందో చూడాలి.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి థియేటర్ కు వస్తున్నారంటే..ఆయన కోసం ప్రత్యేకంగా షోనే వేస్తారు. అలాంటి ఆయన సినిమా చూడటానికి టికెట్ కొనాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహం అక్కర్లేదు. విజయవాడ బస్టాండ్ లో కొత్త ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్ ను ప్రారంభించేందుకు చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మల్టీఫ్లెక్స్ ప్రారంభించి తన దారిన తాను వెళ్లిపోలేదు.

సదరు మల్టీఫ్లెక్స్ లో టికెట్ కొన్నారు. లోపలికి వెళ్లి సినిమాను కాసేపు చూశారు. ప్రయాణికులకు సరికొత్త అనుభూతితో పాటు.. వినోదాన్ని పంచే ఉద్దేశంతోఈ మల్టీఫ్లెక్స్ ల్ని ఏర్పాటు చేశారు. వెయ్యి మినీ థియేటర్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్న వైస్ర్కీన్స్ దేశంలో మరెక్కడా లేని విధంగా బెజవాడ బస్టాండ్ లో మల్టీఫ్లెక్స్ ఏర్పాటు చేయటం.. దాన్ని చంద్రబాబు స్టార్ట్ చేయటం తెలిసిందే. ఏమైనా.. చంద్రబాబు టికెట్ కొనుక్కొని సినిమా చూడటం అందరి దృష్టిని ఆకర్షించింది.
Tags:    

Similar News