ఇన్ని రోజులు ఇంత తీవ్రమైన స్థాయిలో కేవలం వారి పార్టీ ఒక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు సమానంగా పోరాటం చేసినప్పటికీ కూడా.. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేని పంజాబ్ లోని పార్టీల ఎంపీలు కూడా ఏపీ ఆందోళన సబబే అని సానుభూతి వ్యక్తం చేస్తుండగా - తెలంగాణ లో తెరాస ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ వారి ఎంపీ కవిత కూడా ఏపీ ఆవేదన సబబే అని మద్దతు ఇస్తుండగా.. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ కూడా.. భాజపా ప్రభుత్వ పెద్దల పాషాణ హృదయాలు కరగడం లేదంటే.. చంద్రబాబునాయుడు వాస్తవాల్ని అంచనా వేయగల స్థితిలో ఉన్నారా లేదా అని అనుమానం కలుగుతోంది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా ‘‘ఇంకాపోరాటం చేయండి - మన హక్కులు సాధించుకోవాల్సిందే’’ అనే పడికట్టు మాటలు వల్లిస్తూ పోతే.. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి అన్యాయం చేసిన వారవుతారని అంతా అనుకుంటున్నారు. ఇంతగా తమ ఆందోళనను చిన్నచూపు చూస్తున్న ఇంకా మిత్రధర్మం అంటూ ధర్మపన్నాలు వల్లిస్తూ ఆయన ఏం సాధించదలచుకుంటున్నారో అర్థం కావడం లేదని పలువురు ఆగ్రహిస్తున్నారు.
నాలుగు రోజులుగా ఆందోళనలే జరుగుతున్నాయి. రెండోరోజున జైట్లీ ప్రసంగంలో ఏమైనా ఉపశమనం ఉంటుందేమో అనుకున్నారు.. లేదు! మూడో రోజున ప్రధాని ప్రసంగంలో ఏమైనా మాట ఇస్తారేమో అనుకున్నారు.. రాలేదు!! నాలుగోరోజున మళ్లీ జైట్లీ ప్రసంగంలో ఖచ్చితంగా ఏపీ ప్రస్తావన ఉంటుందని ఆశించారు.. ఆయన పట్టించుకోనేలేదు!! బీభత్సంగా పోరాడి.. ఏపీ గురించి మాట్లాడాల్సిందే అంటూ నానా యాగీ చేస్తే.. మీకు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేశాం.. మిగిలినవి రెండే.. ఒకటి ప్యాకేజీ - మరొకటి రెవిన్యూ లోటు.. అంటూ జైట్లీ ఎంత నిర్లక్ష్యంతో కూడిన సమాధానం ఇచ్చారో జనానికి మొత్తం అర్థమవుతున్నది.. ఒక్క చంద్రబాబునాయుడుకు తప్ప..!
కేంద్రంలోని మోడీ సర్కారు తీరు ముంజేతి కంకణంలాగా ఇంత స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ లోక్ సభలో జైట్లీ ప్రసంగిస్తోంటే తెదేపా సభ్యులు అడ్డుపడ్డారు. చివరికి ఆయన ఏపీ సంగతి ప్రస్తావన తెచ్చి.. రెండు ప్రభుత్వాల మధ్య గణాంకాల్లో తేడాలు వస్తున్నాయంటూ కొన్ని రోజుల్లో తేలుస్తాం అంటూ ముక్తాయించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న రెవిన్యూ లోటు లెక్కల్లో దారుణంగా కోత పెట్టి.. ఏదో ముష్టి విదిలించడానికి ఆల్రెడీ మోడీ సర్కారు రంగం సిద్ధం చేసుకుని ఉన్నట్లుగా కనిపిస్తోంది. వారి వైఖరి తేటతెల్లం అవుతున్నప్పటికీ.. చంద్రబాబు వేచిచూడడం అనవసరం అని, చంద్రబాబు తెగతెంపుల నిర్ణయం తీసుకుని.. ప్రత్యక్ష - న్యాయపోరాటానికి దిగితే అంతో ఇంతో మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు.