ఒకవైపు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్లు అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ వరకూ అంతా స్పందిస్తూ ఉన్నారు. దాడులు ఎదుర్కొన్న తమ కార్యకర్తల కోసం ఒక యాత్రనే చేపట్టనున్నారట చంద్రబాబు నాయుడు.
ఇక లోకేష్ కూడా హెచ్చరికలు చేసేస్తూ ఉన్నారు. ట్విటర్ వేదికగా లోకేష్ తమ సహనానికి పరీక్షలు పెట్టొద్దంటూ హెచ్చరించేస్తూ ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఆరు మందిని చంపారంటూ లోకేష్ నంబర్ కూడా ఒకటి రెడీ చేశారు. ఈ నంబర్ ను ఇక నుంచి పెంచుకుపోయే అవకాశాలు ఉన్నాయి.
ఈ అంశంపై అధికార పార్టీ వేరే రకంగా స్పందిస్తూ ఉంది. కుటుంబ కారణాలతో జరిగిన హత్యలను కూడా రాజకీయ ప్రతీకార కౌంట్ లోకి వేస్తున్నారని హోంమంత్రి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ఎన్నికలు అయ్యాకా కొన్ని చోట్ల దాడులు చేసిన వైనాన్ని ప్రస్తావించారు. ఎవరినీ వదిలేది లేదని, చట్టం తన పని తను చేసుకుపోతుందని ఆమె అన్నారు.
ఆ సంగతలా ఉంటే.. తమపై సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ వాళ్లు బాగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగానే తమను ఊర్లలోకి రానివ్వడం లేదని కొంతమంది చంద్రబాబును కలిసి వాపోతూ ఉన్నారట. అయినా మరీ అంత రాజకీయ వైరం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఎవరైనా?
గతంలో అధికారం తమ చేతిలో ఉందని తెలుగుదేశం పార్టీ బాగా దర్పం చలాయించిన చోట, రాజకీయ దాడులు చేసిన చోటే.. ఇప్పుడు ప్రతీకారదాడులు ఉండొచ్చు. ప్రతీకార దాడులు అనేవి ఎవరు చేసినా తప్పే. అయితే ఆ దాడుల తీవ్రత ఎక్కువగా ఉండటం అంటే మాత్రం గతంలో అక్కడ జరిగిన సంఘటనలు చాలానే ఉంటాయని చెప్పవచ్చు.
ఒంటి చేతి చప్పట్లు ఎక్కడా మోగవు. అధికారం ఉందని గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రత్యర్థులపై దాడులు చేసిన చోటే, ఇప్పుడు ప్రతీకార దాడులు ఉండవచ్చు. వీటిని అరికట్టాల్సింది ప్రభుత్వం కాదు. ఎక్కడిక్కడ స్థానికులే నియంత్రణలో ఉండాలి. అప్పుడే అందరికీ క్షేమమని పరిశీలకులు అంటున్నారు.