ఆ మూడు అత్యవసరమంటున్న చంద్రబాబు

Update: 2016-01-25 11:01 GMT
 దావోస్ లో ఆర్తిక సదస్సుకు వెళ్లొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తన పర్యటన వివరాలను వెల్లడించారు. దావోస్ లో ఏం తెలుసుకున్నానన్నది చెప్పుకొచ్చారు. ఈ సాంకేతిక యుగంలో నైపుణ్యం - సమర్థత - సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని ఆయన సూత్రీకరించారు.  పారిశ్రామిక విప్లవం వల్ల లాభనష్టాలను బేరీజు వేసుకుని ముందుకు సాగే వెసులుబాటు సాంకేతిక పరిజ్ణానం వల్ల ఒనగూరుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిశ్రమల స్థాపన - పెట్టబడుల ఆకర్షణ ఏ విధంగా ఉండాలన్న విషయాలను దావోస్ పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిథులతో చర్చించినట్లు చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు చాలా కంపెనీలు ఆసక్తిక కనబరుస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.

దావోస్‌ ఆర్థిక సదస్సు వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వెసులుబాటు కలిగిందని చంద్రబాబునాయుడు చెప్పారు.  ఇలాంటి సదస్సుల నుంచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా అందించాలో తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వం - ప్రైవేటు భాగస్వామ్యంతో మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా కల్పించాలి అనే ఒక ఆలోచనగా ఉందన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగించుకుని ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు. మామూలుగానే టెక్ సవ్వీ సీఎం అయిన చంద్రబాబు దావోస్ లో మరోసారి టెక్నాలజీకి ఫిదా అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ గవర్నమెంటు అంటూ ఇరగదీస్తున్న ఆయన ఇకపై టెక్నాలజీలో ఇంకేం కొత్తదనం చూపిస్తారో చూడాలి.

Tags:    

Similar News