అంతా.. ఇంత‌ని చెప్పే బాబు అస‌లు బ‌లం ఇదేనా?

Update: 2019-05-24 07:57 GMT
నూటికి వెయ్యి శాతం విజ‌యం మాదేనంటూ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌క ముందు గెలుపు మీద ధీమాను ప్ర‌క‌టించిన టీడీపీ అధినేత బాబు.. ఇప్పుడు నోరు విప్పేందుకు సైతం జంకుతున్నారు. మైకు క‌నిపిస్తే చాలా.. వాటి సంగ‌తి చూసే బాబు.. దారుణ ఓట‌మి త‌ర్వాత మౌనంగా ఉండ‌టానికే ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు చెబుతున్నారు. టీడీపీ బ‌లం గురించి అదే ప‌నిగా గొప్ప‌లు చెప్పే చంద్ర‌బాబుకు.. ఇప్పుడు పార్టీ అస‌లు బ‌లం ఏమిటో తెలిసి వ‌చ్చేలా ఏపీ ఓట‌ర్లు తెలియ‌జేశార‌న్న మాట వినిపిస్తోంది.

గెలిచిన ప్ర‌తిసారీ అంతా త‌మ స‌త్తానే అని చెప్పుకునే టీడీపీ నేత‌లు.. ఇక‌పై త‌మ బ‌ల‌మంటూ గొప్ప‌లు చెప్పుకునే సాహ‌సం ఇప్ప‌ట్లో చేయ‌క‌పోవ‌చ్చంటున్నారు. 1999 నుంచి ప్ర‌తి ఎన్నిక‌ల్లో ఎవ‌రో ఒక‌రితో పొత్తు పెట్టుకుంటూ గెలిచే చంద్ర‌బాబు విభ‌జ‌న త‌ర్వాత జ‌న‌సేన‌.. బీజేపీతో పొత్తు పెట్టుకొని విజ‌యం సాధించారు.

తమ విజ‌యం కేవ‌లం త‌మ‌ది మాత్ర‌మేన‌ని గొప్ప‌లు చెప్పుకున్న త‌మ్ముళ్లు.. తాజాగా ఎదురైన దారుణ ఓట‌మికి ఏమ‌ని స‌మాధానం ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత సింగిల్ గా బ‌రిలోకి దిగిన టీడీపీకి 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 23 సీట్లు మాత్ర‌మే రావ‌టం చూస్తే.. ఆ పార్టీ ప‌రిస్థితి ఏపీలో ఎంత ద‌య‌నీయంగా ఉందో అర్థ‌మ‌వుతుంది. మ‌రోవైపు.. లోక్ స‌భకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 25 స్థానాల‌కు కేవ‌లం 3 సీట్ల‌లో మాత్ర‌మే విజ‌యం సాధించిన దుస్థితి. ఏది ఏమైనా.. తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాలు టీడీపీ సొంత బ‌లం ఎంత‌న్న విష‌యంపై తెలుగు త‌మ్ముళ్ల‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చేసి ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News