పవన్ ను చూసి మోడీ, మోడీని చూసి బాబు... ఉత్సాహం...పిక్స్ వైరల్!
ఈ సందర్భంగా... మోడీ - చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి కూటమి మద్దతుదారులు ఉత్సాహంగా కనిపించారని అంటున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకే వాహనంపై రోడ్ షో నిర్వహించారు.
అవును... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకే వాహనంపై మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభ వేదిక అయిన ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకూ రోడ్ షో నిర్వహించారు. ఈ సమయంలో వారికి అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఇందులో భాగంగా అడుగడుగునా పూలు చల్లారు. ఈ సందర్భంగా ఆ వాహనంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ మూందుకు సాగారు. అనంతరం.. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా... మోడీ - చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి కూటమి మద్దతుదారులు ఉత్సాహంగా కనిపించారని అంటున్నారు. ఇక పవన్ ను చూసిన అనంతరం మోడీలో, మోడీని చూసిన తర్వాత చంద్రబాబులో తెలియని ఉత్సాహం కనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా... ఏపీని అభివృద్ధి బాట పట్టించే క్రమంలో భాగంగా రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చుడుతుండటం కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఏపీకి విచ్చేసిన ప్రధానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికారు!