ప్రకృతి వైపరీత్యం ఏదైనా చోటు చేసుకున్నప్పుడు.. దాని కారణంగా జరిగే నష్టం వెంటనే అర్థం కాదు. కంటికి కనిపించే కొన్ని అంశాలతోనే నష్టం ఎంత జరిగిందని అంచనాకు రాకూడదు. పడిపోయిన బిల్డింగులు.. కూలిపోయిన చెట్లు.. దెబ్బ తిన్నపంట లాంటివి కంటికి కనిపించినా.. వెంటనే దృష్టికి రాని వాటి కారణంగా ఉండే నష్టాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విభజన వ్యవహారం కూడా అంతే. విభజన కారణంగా ఏపీని భారీగా దెబ్బ తీస్తుందన్న విషయంపై అందరికి స్పష్టత ఉన్నా.. ఎంత దారుణంగా దెబ్బ తీస్తుందన్న విషయం ఏపీ ప్రభుత్వ లెక్కల్ని నిశితంగా చూసినోళ్లకు మాత్రమే అర్థమయ్యేది.
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ బడ్జెట్ రూ.1.2లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటే.. పది జిల్లాలు ఏపీ నుంచి పోయినా.. ఏపీ బడ్జెట్ మాత్రం లక్ష కోట్ల మార్క్ దాటటం చూసినప్పుడు బడ్జెట్ లెక్కలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే ఆదాయమే రూ.45వేల కోట్లకు మించే ఉంటుంది. అంత పెద్ద మొత్తాన్ని విభజన కారణంగా కోల్పోయినా ఏపీ బడ్జెట్ మాత్రం లక్ష కోట్ల మార్క్ ను దాటటం చూస్తే మన నేతల లెక్కలు ఎంత బాగున్నాయో అర్థమవుతుంది.
బడ్జెట్ అంచనాల్ని పక్కన పెడితే.. ఏపీ ఆర్థికపరిస్థితి వాస్తవంగా ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయం. రోజులు గుడుస్తున్న కొద్ది ఆర్థిక పరిస్థితి దిగజారటమే తప్పించి మెరుగు పడుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. ఎప్పటికప్పుడు ఎంతోకొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొని బండి లాగించే ధోరణి తప్పించి.. అప్పులు లేకుండా ప్రభుత్వ రథాన్ని ముందుకు నడిపించే పరిస్థితి కనుచూపు మేర కనిపించటం లేదనే చెప్పాలి.
విభజన నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక లోటును అధిగమించేందుకు.. ఆర్థిక కష్టాల్ని గట్కెక్కించేందుకు ఎన్నుకున్న మార్గం అప్పులు చేయటం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఐదుసార్లు అప్పులు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ (ఆగస్టు వరకు) ఆంధప్రదేశ్ రాష్ట్రం ఐదు సార్లు అప్పులు చేయటమే కాదు.. ఆరోసారి అప్పు కోసం దరఖాస్తు చేసింది. ఏప్రిల్ నుంచి మూడుసార్లు రూ.1500చొప్పున.. నాలుగోసారి రూ.800 కోట్లు.. ఐదోసారి రూ.750 కోట్లను అప్పుగా సమీకరించగా.. తాజాగా ఆరోసారి రూ.400 కోట్ల సమీకరణకు ఏపీ సర్కారు సిద్ధమైంది.
మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. తాజాగా అప్పుగా తేనున్న రూ.400 కోట్లను తీర్చటానికి ఏకంగా 20 సంవత్సరాలు గడువు కోరటం గమనార్హం. దాదాపు రూ.1.20లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న రాష్ట్రం కేవలం రూ.400 కోట్ల అప్పును తీర్చటానికి 20 ఏళ్ల టైం అడుగుతుందంటేనే ఏపీ ఆర్థిక పరిస్తితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. తన వార్షిక బడ్జెట్ లో ఒక శాతానికి కంటే తక్కువ మొత్తాన్నితీర్చటానికి ఇన్నేసి ఏళ్లు ఎందుకు పడుతుందన్నది ఒక ప్రశ్న. ఈ విన్నపాన్ని చూస్తేనే ఆర్థికంగా ఏపీ ఎంత దారుణంగా చితికిపోయిందే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.