ఏపీ కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. త్వరలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించవచ్చనే చర్చ టీడీపీలో మొదలైంది. ఎంతటి వారినైనా తన అవసరా లకు ఉపయోగించుకుని.. తర్వాత వారిని వ్యూహాత్మకంగా పక్కనపెట్టేయగల నేర్పు సీఎం చంద్రబాబు సొంతమనే విషయం తెలిసిందే! తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ జాబితాలో అఖిలప్రియ కూడా చేరిపోయారట. నంద్యాల ఉప ఎన్నికల్లో తన సర్వ శక్తులు ఒడ్డి.. టీడీపీ విజయానికి కృషి చేసిన ఆమెను.. విధులు సక్రమంగా నిర్వహించట్లేదనే సాకుతో మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారట.
పార్టీలో చేరితో కేసులు ఉండవని, మంత్రి పదవి ఇస్తామని ఆశచూపి వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డిని సీఎం చంద్రబాబు టీడీపీలో చేర్చేసుకున్నారు. తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోవడం.. తర్వాత నాగిరెడ్డి మరణించడం.. ఇక భూమా వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు తప్పని పరిస్థితుల్లో ఆయన కూతురు అఖిలప్రియకు ఏ మాత్రం ప్రాధాన్యంలేని శాఖను కట్టబెట్టాల్సి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల భారాన్ని కూడా ఆమెపైనే వేసి.. సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. అయితే ఇప్పుడు ఆమె హవా క్రమంగా తగ్గించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం!
కొంత కాలంగా అఖిల ప్రియ.. బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని సీనియర్లు గుర్రుగా ఉన్నారట. నంద్యాల ఉపఎన్నికల అయిపోయి ఒకటిన్నర నెలలవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం. సీఎం నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదట. పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని - మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారట.
ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయట. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. దీనిపై భూమా వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత చంద్రబాబు.. తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం విలువ లేని శాఖను అఖిల ప్రియకు ఇచ్చారని చెబుతున్నారు. పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిల కు బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.