ఏదైనా రంగానికి కొత్త ఊపునిచ్చేందుకు.. సరికొత్త జోష్ తెచ్చేందుకు ప్రముఖుల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించటం.. వారి చేత ప్రచార కార్యక్రమాల్ని చేపట్టడం తెలిసిన విషయమే. ఇదే రీతిలో స్మార్ట్ గ్రామాలు.. వార్డుల అంశంపై ఏపీ సర్కారు తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. స్మార్ట్ గ్రామాలు.. వార్డులకు సంబంధించిన ప్రణాళికకు కొత్త ఊపునిచ్చే దిశగా అడుగు పడింది. ప్రతి జిల్లాకు ఒక ప్రముఖ వ్యక్తిని అంబాసిడర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్మార్ట్ గ్రామాలు.. వార్డులను అభివృద్ధి పరిచేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్తగా ఆలోచన చేయటం తెలిసిందే. ఈ కాన్సెప్ట్ ని మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. వాణిజ్య వేత్తల్ని భాగస్వామ్యం చేసేందుకు అంబాసిడర్ వ్యూహానికి తెర తీశారు. వివిధ జిల్లాలకు ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని అంబాసిడర్లుగా నియమించారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఆధ్వరంలో అంబాసిడర్లు పని చేయనున్నారు. అదే సమయంలో స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ బాధ్యతల్ని సైతం దేశంలోనే పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తలైన రతన్ టాటా.. విప్రో అజీం ప్రేమ్ జీ.. ఆనంద్ మహీంద్ర తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
గ్రామాల్ని దత్తత తీసుకున్న వారిని సమన్వయం చేసుకుంటూ.. గ్రామాలు.. వార్డుల్ని స్మార్ట్ గా తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ వ్యవహారాన్ని ప్రముఖులకు అప్పగించాలన్నది చంద్రబాబు ఐడియా. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని కొన్ని జిల్లాలకు ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని అంబాసిడర్లుగా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఏపీలోని కొన్ని జిల్లాలకు బాబు సర్కారు అనుకుంటున్న అంబాసిడర్ల వివరాలు చూస్తే..
1. శ్రీకాకుళం జిల్లాకు జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లికార్జునరావు
2. విశాఖపట్నం జిల్లాకు దివిస్ ఫార్మా అధినేత మురళీ
3. తూర్పు గోదావరి జిల్లాకు పారిశ్రామికవేత్త ఎన్ సీసీ రాజు
4. కృష్ణా జిల్లాకు నవయుగ విశ్వేశ్వరరావు
5. గుంటూరు జిల్లాకు బొమ్మిడాల శ్రీనివాస్
6. నెల్లూరు జిల్లాకు డాక్టర్ రెడ్డీస్ ప్రసాద్ రెడ్డి
7. చిత్తూరు జిల్లాకు గల్లా రామచంద్రనాయుడు
వీరే కాకుండా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అవేమంటే.. మెగా కృష్ణారెడ్డి.. బీవీ మోహన్ రెడ్డి.. మండవ ప్రభాకర్