చంద్రబాబు అమెరికా పర్యటన రైట్ టైంలోనేనా?

Update: 2016-10-13 19:30 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల్లో సుదీర్ఘ విదేశీ పర్యటన చేయనున్నారు.  పది రోజులుకు పైగా ఆయన అమెరికాలో పర్యటించబోతున్నారు. నవంబర్ 12 నుంచి 22 వరకూ ఆయన 11 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవ్యాంధ్రకు పెట్టుబడులను తీసుకు రావడమే లక్ష్యంగా - ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు - ప్రవాస భారతీయులతో ప్రత్యేక సమావేశాలు జరిపేందుకు ఈ పర్యటన జరుపుతున్నారు. కాగా పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు - నారాయణ - వివిధ శాఖల అధికారులు వెళ్తారు.

అదేసమయంలో చంద్రబాబు అమెరికా పర్యటన షెడ్యూల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు అక్కడ పర్యటిస్తుండడంతో ఆయన అనుకున్న పని ఎంతవరకు అవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పర్యటనను కాస్త ముందుగానో లేదంటే ఒక నెల రోజులు ఆలస్యంగానో పెట్టుకుంటే బాగుండేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ‌కు పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ దేశంలో వారం రోజుల పాటు తిరుగుతున్నారు. వాషింగ్టన్ - న్యూజెర్సీ - న్యూయార్క్ - సిలికాన్ వ్యాలీ - మిన్నెసోట - చికాగోలో పర్యటిస్తారు.  నిజానికి ఆయన కూడా నవంబరులోనే వెళ్లాలని తొలుత భావించినా అధ్యక్ష ఎన్నికల హడావుడిలో వెళ్తే సరైన టైం కాదని భావించి ముందే వెళ్లారు. కానీ, చంద్రబాబు మాత్రం అమెరికా అంతా అధ్యక్ష ఎన్నికల హడావుడిలో ఉండే సమయంలో తన పర్యటన పెట్టుకోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News