తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త సమస్య ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అంటున్నారు. పార్టీ పరంగా సమస్య వచ్చిందేమో అనుకునేరు కానే కాదు. ప్రభుత్వపరంగా చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయం ఆయనకు నేటి నుంచి తలనొప్పిగా మారనుంది. బందరు పోర్టు నిర్మాణంతోపాటు, పారిశ్రామిక అవసరాల కోసమంటూ 36 వేల ఎకరాలు సమీకరించేందుకు ఏపీ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీనిపై బందరు నగర పాలక సంస్థతోపాటు - 28 గ్రామాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు బందరు పోర్టు నిర్మాణం కోసం తెదేపా సర్కారు చేయనున్న భూ సమీకరణ ప్రతిపక్షాలకు అస్త్రం కానుంది.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో బందరుపోర్టు నిర్మాణం - చమురు శుద్ధి కర్మాగారాలకు చెందిన 7 యూనిట్ల నిర్మాణాలకు లక్షా ఐదువేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించినట్లు సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. దానితో బందరు - పరిసర ప్రాంతాల్లోని 28 గ్రామాల్లో నిరసన భగ్గుమంది. దానితో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మంత్రి దేవినేని ఉమ - కొల్లు రవీంద్ర వెంటనే మీడియా సమావేశం ఏర్పాటుచేసి మొత్తం 36 వేల ఎకరాలు మాత్రమే తీసుకుంటామని - లక్షా ఐదువేల ఎకరాలు కాదని వివరణ ఇచ్చారు. కానీ, రైతుల్లో ఆగ్రహం తగ్గకపోగా.. అధికారులు - తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకోవాలని ఎక్కడికక్కడ తీర్మానాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశాన్ని వైసీపీ - వామపక్షాలు సద్వినియోగం చేసుకునేందుకు రంగంలోకి దిగాయి.
ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తాము స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి - రైతులకు బాసటగా నిలుస్తామని ప్రకటించారు. వైసీపీ నేత పార్ధసారథి కూడా రంగంలోకి దిగడంతో, ఈ పరిణామాలన్నీ పార్టీకి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన తెదేపా నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా విపక్షాలు చేస్తున్న ప్రచారం తెదేపాకు ఇబ్బందికరంగా పరిణమించిందని అంటున్నారు. తెదేపా విపక్షంలో ఉన్నప్పుడు బందరు పోర్టుకు 2 వేల ఎకరాలు సరిపోతాయని, కాంగ్రెస్ నేతల కోసమే వేల ఎకరాలు సమీకరిస్తారా అని చేసిన విమర్శను విపక్షాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి. ఆ తర్వాత ఏర్పాటయిన అఖిలపక్షంలో బందరు పోర్టుకు 5 వేల ఎకరాలు సరిపోతాయని నిర్ణయం తీసుకున్నప్పుడు, అందులో ఇప్పుడు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర కూడా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వం 36 వేల ఎకరాలు తీసుకుంటుంటే కొల్లు రవీంద్ర - ఎంపి కొనకళ్ల నారాయణ ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీస్తుంటే, తెదేపా ఆత్మరక్షణలో పడింది. మరోవైపు సమీకరణను సమర్ధిస్తున్న ఎంపి నారాయణ - మంత్రి కొల్లు రవీంద్రను ఇటీవల బందరు మండలం కోన గ్రామంలోకి రానీయకుండా రైతులు తరిమేశారు. పొట్లపాలెం రైతులు కూడా తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో నేడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, గ్రామాల్లో రైతుల తిరుగుబాటు ఇంకా ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన తెదేపాలో కనిపిస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ అఖిలపక్షంగా ఏర్పడి, గ్రామాల్లోకి తెదేపా నేతలు - అధికారులను రానీయకుండా అడ్డుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.