పిలిచి మరీ సలహాలు కోరినప్పుడు.. వారి సలహాలకు.. సూచనలకు కాసింత మర్యాద.. గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే నిర్మాణాల డిజైన్లు ఎలా ఉండాలన్న విషయంపై నార్మన్ ఫోస్టర్ కంపెనీ కొన్ని మోడళ్లను చూపించటం.. వీటిని చూసిన ఏపీ సీఎం చంద్రబాబు పెదవి విరవటం తెలిసిందే.
నార్మన్ ఫోస్టర్ డిజైన్ల పట్ల సంతృప్తి చెందని చంద్రబాబు.. ప్రముఖ దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకంగా పిలిపించి.. తానేం అనుకుంటున్నానన్న విషయాన్ని ఆయన చెప్పటమే కాదు.. తన ఆలోచనలకు తగ్గట్లు డిజైన్ల విషయంలో సలహాలు.. సూచనలు ఇవ్వాలని కోరిన వైనం తెలిసిందే.
బాహుబలి మూవీతో తన ప్రతిభ ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి.. ఏపీ సీఎం పిలుపు నేపథ్యంలో రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించటంతోపాటు.. నిర్మాణ డిజైన్లను పరిశీలించారు. డిజైన్ల స్థానికత కోసం చరిత్ర మీద ఫోకస్ చేసి.. అందుకు తగ్గట్లు కొంత పరిశోధన చేసి మరీ తనదైన ప్రజంటేషన్‌ను సిద్ధం చేశాడు.
సీఆర్డీ అధికారులు.. పలువురు మంత్రులతో కలిసి లండన్‌కు వెళ్లిన రాజమౌళి.. అక్కడి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ప్రజంటేషన్ ఇచ్చారు. జక్కన్న ప్రజంటేషన్ పట్ల నార్మన్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారట. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడో ఊహించని ట్విస్ట్ ఎదురైందని చెబుతున్నారు.
డిజైన్ల విషయంలో జక్కన్న సూచించిన మార్పుల్ని పట్టించుకోకుండా.. పాత డిజైన్లకే ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తోంది. అంటే.. జక్కన్న డిజైన్లు నచ్చలేదా? రాజమౌళి చేసిన సూచనల్ని బాబు ఎందుకు పక్కన పెట్టారు? పాత డిజైన్ల వైపే బాబు ఎందుకు మొగ్గు చూపారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పాత డిజైన్లే బాగున్నాయని అనుకున్నప్పుడు మధ్యలో తన దారిన తాను పోయే జక్కన్నను పిలిపించటం ఎందుకు? డిజైన్ల బాధ్యత అప్పజెప్పి మరీ.. ఇప్పుడిలా చేయటం ఎందుకన్న ప్రశ్నలు పలువురి నుంచి వస్తున్నాయి. దీనిపై బాబు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.