మెరీనాబీచ్ స్ఫూర్తితో విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించాలని భావించిన శాంతియుత నిరసన దీక్ష అట్టర్ ఫ్లాప్ అయినట్లుగా ఏపీ అధికారపక్ష నేతలు చెప్పుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకోవాల్సినఅవసరం లేదని చెబుతున్న తెలుగుదేశం నేతలు.. ప్రజల్లో ఎలాంటి బావోద్వేగాలు లేవని. అందుకే.. నిరసన దీక్షకు స్పందన అస్సలు లేదన్నట్లుగా చెబుతున్నారు.
పనిలో పనిగా.. రాంగ్ టైం.. రాంగ్ ప్లేస్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు.అయితే.. ఇదంతా ప్రచార మాయాజాలమే తప్పించి నిజం ఎంతమాత్రం కాదు. వేలాది మంది పోలీసుల్నిదింపి.. ఆర్కే బీచ్ మొత్తాన్ని పోలీసుల చేతికి అప్పజెప్పేయటమే కాదు.. విశాఖలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుందన్నవిషయాన్ని వైజాగ్ ప్రజలకు రుచి చూపించారని చెప్పాలి.
చేతిలో ఉన్న పవర్.. పోలీసుల బలగంతో ఈ రోజు నిరసన ప్రదర్శన ఎపిసోడ్ లో చంద్రబాబు సర్కారు గెలిచినట్లు కనిపించినా.. ఆయన అడ్డదిడ్డంగా ఓడిపోయారని చెప్పక తప్పదు. విపక్ష నేతను అడ్డంగా అవమానించటమే కాదు.. నిరసనకు వచ్చే ప్రజల్ని హెచ్చరించటం.. నిరసనల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వార్నింగ్ లెటర్స్ పంపటం ద్వారా ఒకలాంటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించిన వైనం చూస్తే.. బాబు ఎంతగా ఫెయిల్ అయ్యింది ఆయన ఏర్పాటు చేసిన పోలీసుల పహరా విషయం మొత్తాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/