ఓటుకు కోట్ల రూపాయలకేసులో చంద్రబాబునాయుడు పాత్రను నిగ్గు తేల్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సాగిస్తున్న న్యాయపోరాటం కీలకమైన దశకు చేరుకుంది. నాకు కేసులంటే భయంలేదు.. అంటూనే... విచారణ నుంచి తప్పించుకోవడానికి గల అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉండే చంద్రబాబునాయుడు కు ఒక డెడ్ లైన్ పెడుతున్నట్లుగా సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. సుప్రీం స్వయంగా ఈ కేసును విచారించాలన్న ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి కోరికను మాత్రం తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులో తాము జోక్యం చేసుకోబోం అంటూనే.. నాలుగు వారాల్లోగా ఈ విషయాన్ని మొత్తం తేల్చేయాలంటూ ఆదేశించింది. లేకుంటే సుప్రీంను ఆశ్రయించవచ్చు అని కూడా స్పష్టంగా చెప్పింది.
నిజానికి సుప్రీం తీర్పులో చంద్రబాబునాయుడు ఆనందించాల్సిన అంశాలు ఎంతమాత్రమూ లేవు. ఆళ్ల పిటిషన్ ను స్వీకరించలేదు అనేది తప్ప.. నాలుగు వారాల్లోగా హైకోర్టును పని పూర్తి చేయమని చెప్పడం.. నిజానికి చంద్రబాబుకు చేదు వార్త. అయితే పిటిషన్ ను తీసుకోలేదని తెలియగానే.. శుక్రవారం పచ్చ మీడియా మొత్తం పండగ చేసేసుకుంది. సుప్రీంలో జరిగిన పరిణామాల గురించి ఎవరికి ఏం అర్థమైందో తెలియదు గానీ.. ఆళ్ల పిటిషన్ ను తీసుకోకపోగానే - ఆయన కేసు ఓడిపోయినట్లుగా.. చంద్రబాబునాయుడు సచ్ఛీలుడు అని తేలిపోయినట్లుగా.. పచ్చమీడియా హడావిడి చేసింది. సుప్రీంతీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినట్లుగా ప్రచారం చేసింది.
నిజానికి చంద్రబాబుకు ఇది ఇబ్బందికరమైన పరిణామం. నాలుగు వారాల్లోగా హైకోర్టు విచారణను తేల్చేయడం అంటే.. దానికంటె కింది కోర్టు ఏసీబీ కోర్టు కూడా విచారణ తేల్చేయాలి. వారు ఇప్పటికే విచారణ ఆదేశించి ఉన్నారు. ఏతావతా.. మధ్యలో ఇంకేమైనా మాయ జరిగితే తప్ప.. చంద్రబాబుకు ఇబ్బంది కర పరిణామాలు తప్పకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.