సమర్థత అనేది మనిషిలోని వ్యక్తిత్వాన్ని శ్రద్ధను ప్రావీణ్యాన్ని బట్టి ఉంటుందా? లేదా వయసును బట్టి ఉంటుందా? ఈ విషయంలో చంద్రబాబునాయుడు.. యువతను కీర్తించడానికి వయసు పాట పాడి.. మెజారిటీ వర్గానికి అసంతృప్తి కలిగిస్తున్నారని తాజాగా అనుకోవాల్సి వస్తోంది. అచ్చంగా 30 దాటని వయసు వారిలో మాత్రమే సమర్థత ఉండేట్లయితే గనుక.. 65 ఏళ్లు దాటిన ముదుసలి చంద్రబాబును ముఖ్యమంత్రిగా నెత్తిన పెట్టుకుని.. ముందుకు సాగడం తెలుగు ప్రజలు చేస్తున్న తప్పిదమా? అని రాష్ట్రం ప్రశ్నించే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారు.
చంద్రబాబునాయుడు తాజాగా యువతను ఉద్దేశించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమం అది. యాప్స్ తయారీ విడుదలకు సంబంధించిన కార్యక్రమం. పైగా అది ఒక కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. సభికులు అంతా యువతరమే గనుక.. సదరు యువతరాన్ని కీర్తించడం అనేది తన ప్రసంగంలో ప్రధానంగా ఉండాలని చంద్రబాబు తలపోసి ఉండవచ్చు. ఆయన ఏకంగా.. తాను నిత్యం జపిస్తూ ఉండే- 2020 సంవత్సరం నాటికి ప్రపంచంలో ఇప్పటి అగ్రశ్రేణి దేశాల్లో అంతా 40 దాటిన వృద్ధులు ఉంటారని.. భారత్‌లో మాత్రం.. 29 ఏళ్ల వయస్సు వారు పుష్కలంగా ఉంటారని... అందువలన భారత్ ప్రపంచ దేశాలను శాసిస్తుందని సెలవిచ్చేశారు. మన వద్ద 29 ఏళ్ల ప్రాయపు కుర్రకారు జాస్తిగా ఉంటుంది గనుక.. చైనా జపాన్ ఐరోపా దేశాలను భారత్ దాటిపోతుందని.. చంద్రబాబు చెప్పిన మాటలు ఎంతమందికి విశ్వాసం కలిగించాయో మనకు తెలియదు గానీ.. సమర్థత అనేది 40 దాటిన వారిలో ఉండదు అని అర్థం వచ్చేలా ఉన్నదని.. పలువురు చంద్రబాబు మీద గుర్రుగా అవుతున్నారు. మిగిలిన అన్ని ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్‌లో కూడా.. వయస్సు మళ్లిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న మాట వాస్తవం. సగటు వయో పరిమితి పెరుగుతూ... వయస్సు మళ్లిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదే విషయం ప్రస్తావించి.. ఆయన ఎక్కువ మందిని కనడం గురించి రెండు రోజుల కిందట సందేశం ఇచ్చారు కూడా!
అలాంటి నేపథ్యంలో ఎన్నికల విషయంలోనూ.. నలభై దాటిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చంద్రబాబు ఎందుకు మరచిపోయారో అర్థం కావడం లేదు. ఆయన నిర్వచనం ప్రకారం.. సమర్థత అనేది.. వయస్సులో మాత్రమే ఉండేట్లయితే.. మన రాష్ట్రానికి 65 ఏళ్లు దాటిన చంద్రబాబు ఎందుకు నాయకుడు కావాలి? ఎంచక్కా.. 30ల్లోకి ఎంటర్‌కాని ఓ కుర్రాడిని ఎంచుకోవచ్చు కదా.. అని పలువురు చంద్రబాబు మాటల్ని ఎద్దేవా చేస్తున్నారు. ముసలి చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం.. ఆయన అపారమైన అనుభవం నడిపిస్తుందని మురిసిపోవాలా...? మిగిలిన వారి విషయానికి వచ్చేసరికి... 40 దాటడం నెగటివ్ అంశంగా పరిగణించాలా అని ప్రజలు విస్తుపోతున్నారు. యువత ఉండే కార్యక్రమంలో వారిని స్తుతించాలంటే.. చంద్రబాబు ఇతర మార్గాలు చూసుకోవాలి గానీ.. ఇతర వయోవర్గాల వారిని అవమానించేలా మాట్లాడి ఉండాల్సింది కాదని విమర్శలు వస్తున్నాయి.