గురివింద నలుపు ....గురివిందకు తెలీదన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు...సడెన్ గా యూటర్న్ తీసుకొని బీజేపీపై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, పార్లమెంటు సాక్షిగా....చంద్రబాబు నైజాన్ని ప్రధాని మోదీ కూడా ఎండగట్టారు. ఈ నేపథ్యంలో....తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు చంద్రబాబు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపై బీజేపీ చేసిన మోసాన్ని ఎండగట్టాలని తెలుగు తమ్ముళ్లకు సూచించారు. ఈ రోజు తమ పార్టీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు......ఈ విషయం పై దిశా నిర్దేశం చేశారు. అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. ఏపీ హక్కుల సాధన కోసం దొరికే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితబోధ చేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను పార్లమెంటు సాక్షిగా నెరవేర్చాలని ,ఏపీ హక్కుల కోసం పోరాడాలని దిశా నిర్దేశం చేశారు.
అయితే, చంద్రబాబు వ్యాఖ్యలు....దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. వాస్తవానికి ఏపీకి బీజేపీ - టీడీపీలు....తీరని అన్యాయం చేశాయి. హోదా ఏమన్నా సంజీవనా...అని అన్న చంద్రబాబు సడెన్ గా యూటర్న్ తీసుకొని.....హోదాపోరు మొదలు పెట్టిన తీరును ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీని మోసం చేసిన బీజేపీ గురించి ....ఏపీ ప్రజలను మోసం చేసిన మరో పార్టీ టీడీపీ విమర్శించడం నిజంగా హాస్యాస్పదం అనడంలో ఎటువంటి సందేహం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ మోసగిస్తే....రాష్ట్ర స్థాయిలో టీడీపీ మోసగించింది. హోదా కన్నా ప్యాకేజీ ముద్దని .....ప్రగల్భాలు పలికిన చంద్రబాబు....ఇపుడు హోదా కోసం పోరాటాలు...దొంగ దీక్షలు చేయడం....చూసి జనం నవ్వుకుంటున్నారు. నాలుగేళ్ల పాటు హోదాపై మోదీని ప్రశ్నించకుండా.....మిత్రధర్మం పాటించిన చంద్రబాబు...నేడు కూడా వారితో మైత్రిని కొనసాగిస్తున్నారు. పైకి బీజేపీని తిడుతూ..లోపల లోపాయి కారి ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంటు లో రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆ చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు ....బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని బాబుగారు మరో డ్రామాకు తెరతీశారనడంలో సందేహం లేదు. తేలు కుట్టిన దొంగలా ఉన్న చంద్రబాబు....బీజేపీని దొంగ అనడం ఎంతవరకు సమంజసమో ప్రజలు నిర్ణయించుకోవాలి.