తెలుగుదేశం పార్టీకి ఒత్తిడి ప్రారంభం అయింది. ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలకు బీపీ లెవెల్స్ పడిపోయే కొద్దీ.. తెలుగుదేశం నాయకులకు ప్రధానంగా చంద్రబాబునాయుడుకు బీపీ పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. వైకాపా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలకు తిరుగులేని ఆదరణ లభిస్తోంది. ఈ స్పందనను తెలుగుదేశం దళాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
నిన్నటిదాకా తెదేపా ఎంపీలతో సమానంగా, అంతకంటె మించి కూడా పార్లమెంటులో ప్రత్యేకహోదా కోసం వైకాపా ఎంపీలు కూడా పోరాటాలు సాగించినప్పటికీ.. వారి పోరాటాలు డ్రామాలు అని... మోడీ సర్కారుతో కుమ్మక్కు అయి మొక్కుబడిగా పోరాడుతున్నారని నానా మాటలు అంటూ తెలుగుదేశం నాయకులు చెలరేగిపోయారు. కానీ ఇవాళ పరిస్థితి అలాంటి గోబెల్స్ ప్రచారాలకు కూడా అనుకూలంగా లేదు. వైకాపా ఎంపీల దీక్షను పల్లెత్తు మాట అంటే.. ఏ రీతిలో విమర్శించినా సరే.. ప్రజలే తమను ఛీకొట్టేలా కనిపిస్తున్నారు. వారు ప్రాణాలను అడ్డేసి ఏపీ భవన్ లో దీక్ష సాగిస్తున్నారు అనే సంగతి బాగా వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున కూడా ఏదో ఒకటి చేయకుంటే.. మట్టిగొట్టుకుపోతాం అనే సంకేతాలు పార్టీ శ్రేణులు చంద్రబాబుకు నివేదిస్తున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు అమరావతిలో ఇదే మధనంలో గడుపుతున్నారని కూడా చెబుతున్నారు. శనివారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో చర్చించిన చంద్రబాబు.. ఎవ్వరూ ఢిల్లీ వదలి రావద్దని మాత్రం పురమాయించారు. అందరూ అందుబాటులో ఉండాలని కూడా చెప్పారు. మధ్యాహ్నం తర్వాత.. కార్యచరణ ప్రణాళిక చెబుతానంటూ వారికి హింట్ ఇచ్చారు.
మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం అనే ప్రహసనం మొదలైంది. ఇంతా కలిపి చంద్రబాబునాయుడు మాత్రం.. ఢిల్లీలోని ఎంపీలకు ఏమీ చెప్పనేలేదు. వారి ఆమరణ దీక్షలకు దీటుగా ఉండేలాగా.. ఏదోటి చేయాల్సిందే అని.. పార్టీ నాయకులనుంచి చంద్రబాబు మీద కూడా ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిక పరనిందలకు సమయం కాదని, తాము కూడా ఏదోటి చేసి నిరూపించుకోవాలని.. చంద్రబాబు కీలక అనుచరులతో మల్లగుల్లాలు పడుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.