ఏ రోటికాడ ఆ పాట పాడడంలో చంద్రబాబును మించినవారు లేరేమో. కాంగ్రెస్ పేరెత్తితే చాలు విరుచుకుపడే ఆయన అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీని ఏకంగా ఆకాశానికెత్తేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రధానిగా ఆమె సూపర్ అని చంద్రబాబు పొగిడేశారు. దీంతో చంద్రబాబు రెండు నాల్కల ధోరణి మరోసారి చర్చనీయమైంది.
ఇందిరాగాంధీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. భారత ప్రధానిగా ఆమె పోషించిన పాత్ర అసామాన్యమైనదని కొనియాడారు. జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. ఎన్నడూ కాంగ్రెస్ నేతల గురించి ఒక్కటైనా మంచి మాట చెప్పని చంద్రబాబు నోట ఇందిరాగాంధీపై ప్రశంసలు కురవడం అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తోంది. ఇందిర సమర్థరాలైన ప్రధాని అయినప్పటికీ ఎమర్జెన్సీ వంటి వివాదాస్పద నిర్ణయాలు కూడా ఆమె తీసుకున్నవే. అవన్నీ మర్చిపోయిన చంద్రబాబు ప్రధానిగా ఇందిర గొప్ప వ్యక్తని పొగిడేయడం వివాదాస్పదమైంది.
ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన సదస్సు అమరావతిలో జరగడం చాలా ఆనందంగా ఉందని... దీనికి స్పీకర్ కోడెలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చంద్రబాబు కోడెలను కూడా ప్రశంసించారు. ఎందరో మహిళలు పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా విధులను సమర్థవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మహిళా సాధికారత అనేది అసాధ్యమైన అంశం కాదని... మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. ప్రతి మహిళ కలలు కనాలని... వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించాలని సూచించారు. తమ కుటుంబ వ్యాపారాలను తన భార్య, తన కోడలు చూసుకుంటున్నారని చెప్పారు. మహిళా సాధికారతకు ఇది ఒక నిదర్శనమని తెలిపారు. ఇదంతా ఎలా ఉన్నా ఇందిరను ప్రశంసించడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/