బాబు ప్లాన్ బీ..ఫ్లాప్ అయితే కోలుకోలేడు..

Update: 2018-08-25 01:30 GMT
ముందస్తు ఆలోచనలు ఇప్పటికే తెలంగాణ రాజకీయాలను ఊపేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ ముందస్తు ఆలోచన చేస్తున్నాడట. తెలంగాణను మొన్నటి వరకు ఊపేసిన ముందస్తు సెగ ఇప్పుడు ఏపీ రాజకీయాలను తాకింది. సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనలు ఇప్పుడు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనలు ఇటీవల తోటి మంత్రులతో పంచుకున్నాడట.. అయితే ముందస్తు ఎన్నికలకు పోకుండా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి వారిని కార్యక్షేత్రంలో సంసిద్ధులను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ ఐడియాను కూడా బాబు కాపీ కొట్టిందే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుగా ఎమ్మెల్యే - అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించేలా ప్లాన్ చేశారు. ఇప్పుడితే ప్లాన్ ను బాబు కాపీ కొట్టి ముందస్తు అభ్యర్థుల ప్రకటనకు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

చంద్రబాబు ఆదినుంచి ఎన్నికల టైంలోనే అభ్యర్థులను ప్రకటించేవారు.. తెలుగుదేశం పార్టీలో చివరి నిమిషంలో టికెట్లు పంచడం అనేది చాలా సాధారణ విషయం.  టీడీపీ బీ ఫాం కోసం నామినేషన్ వేసే వరకూ అభ్యర్థులంతా ఉత్కంఠగా ఎదురుచూసేవారు..కానీ 2019 ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు తన సహజశైలికి భిన్నంగా వెళ్లాలని ఆలోచిస్తున్నాడట..  ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధపడుతున్నాడట.. అక్టోబర్ లో కొంత మంది మంత్రులకు టిక్కెట్లు ఇచ్చి తర్వాత విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించేందుకు బాబు రెడీ అవుతన్నాడట.. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే చర్చనీయాంశమైంది.

ఏపీలో ఇప్పుడు త్రిముఖ పోరు నెలకొంది. టీడీపీ - వైసీపీ - జనసేన మూడు అధికారం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తే లాస్ట్ మినిట్ లో నాయకులు వేరే పార్టీలోకి జారిపోయి నష్టం చేస్తారని.. అందుకే ముందే తేలిస్తే నష్టం తక్కువగా ఉంటుందని.. కేడర్ లో కూడా స్పష్టత వచ్చి కలిసికట్టుగా పోరాడతారని బాబు ఆలోచిస్తున్నాడట. ఇక అభ్యర్థులు టికెట్ దక్కిందనే ఉత్సాహంతో ముందుగానే ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం చూరగొనే అవకాశాలుంటాయి. అందుకే  ఇప్పుడు బాబు మొదటి విడత విడుదల చేసే జాబితాలో తమ పేరు ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

అయితే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే మరో చిక్కుకూడా ఉంది. నియోజకవర్గానికి ఒకరికే టికెట్ దక్కుతుండడంతో దక్కని వారు వైసీపీ - జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. ఇది అంతిమంగా టీడీపీ పుట్టి ముంచే వ్యవహారంగానే కనిపిస్తోంది.
Tags:    

Similar News