ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విపక్షం వ్యవహరించటం కామన్. అలాంటి ప్రయత్నాలకు చెక్ చెప్పేందుకు అధికారపక్షం పలు విధాలుగా ప్రయత్నిస్తుంటుంది. కానీ.. ఏ అధికారపక్షం కూడా వ్యవహరించనంత దారుణంగా ఏపీ అధికారపక్షం వ్యవహరిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష నేత ప్రస్తావించిన అగ్రిగోల్డ్ అంశం అధికారపక్షాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందన్న విషయం.. ఆ విషయం సందర్భంగా లేవెనెత్తిన విషయాల్ని చూస్తే అర్థమవుతుంది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరించాలంటూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గళం విప్పితే.. దానికి తూతూమంత్రంగా సమాధానం చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి. బాధితులు కోరుకుంటే సీబీఐవిచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించటంలోనే బాధితుల విషయంలో ఆయనకున్న కమిట్ మెంట్ ఏమిటో అర్థమవుతుంది.
ఓపక్క తమకు న్యాయం చేయాలని.. అగ్రిగోల్డ్ ను నమ్మిన దానికి పూర్తిగా మోసపోయామని.. తమను ఆదుకోవాలంటూ ఆడబిడ్డలు కన్నీళ్లు కారుస్తున్న వేళ.. మీరు కావాలంటే సీబీఐ దర్యాప్తు చేయిస్తానంటూ బాబు చెప్పిన మాటలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తాము దారుణంగా మోసపోయామని.. ఆదుకోవాలని అడుగుతుంటే.. అదేమీ పట్టనట్లు.. పైపై మాటలు చెప్పి.. బాధితులు కోరితే సీబీఐ విచారణకు ఆదేశించటానికైనా సిద్ధమని చెప్పిన బాబు మాటలు వింటేనే.. ఆయన కమిట్ మెంట్ ఎంతన్న విషయం అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఈ విషయంలో బాధితులకు న్యాయం చేసే విషయంలో ఎంత సిద్ధంగా బాబు ఉన్నారో అర్థమవుతుందన్న విమర్శ వినిపిస్తోంది. ఈ విషయాన్ని బాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న భావన వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/