అసెంబ్లీ బాబు 'రివర్స్ వాక్'...ఎందుకంటే ?

Update: 2019-12-16 05:09 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. సోమవారం రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై టీడీపీ వినూత్నంగా ఆందోళనలు చేపట్టింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంలో  ఏపీలో టెండర్లన్నీ రిజర్వు చేసుకుని రివర్స్‌ టెండరింగ్‌ అంటున్నారని వైసీపీ సర్కార్‌ పై  చంద్రబాబు మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి   వెనక్కి నడుస్తూ తమ నిరసన తెలియజేశారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేశారు. రూ. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని.. రాష్ట్రంలో ఉన్మాది పాలన.. తుగ్లక్‌ పాలన నడుస్తోందని ఘాటు విమర్శలు చేశారు. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని..ఆంధప్రదేశ్ కి  రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అసెంబ్లీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

ఇకపోతే , ఈ రోజు జగన్ సర్కార్ అసెంబ్లీలో 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ఎస్సీ కమిషన్ బిల్లు - ఎస్టీ కమిషన్ బిల్లు - ఎక్సైజ్ చట్టంలో సవరణలకు సంబందించి రెండు బిల్లులు - ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుతో పాటు మొత్తం 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే నూతన మద్యం విధానంపై  కాసేపు చర్చించనున్నారు.  అయితే , ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి  రోజుకో అంశాన్ని తీసుకోని  టీడీపీ ప్రభుత్వం పై ఫైర్ అవుతూనే ఉంది.


Tags:    

Similar News