ఎన్నికల్లో గెలవాలంటే ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకుంటే చాలన్న భావన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది. 2014లో మోదీ ఘన విజయం.. మొన్నటికి మొన్న ఏపీ ఎన్నికల్లో జగన్ ఘన విజయం.. ఆ తరువాత మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిశోర్ ను హైర్ చేసుకుంటున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ హాట్ కేకులా మారారు. అధికారం కోల్పోయిన పార్టీలు - వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని భయపడుతున్న పార్టీలు ప్రశాంత్ కిశోర్ సేవలు తమకు దొరుకుతాయా అని ట్రై చేస్తున్నాయి. అదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికలకు వ్యూహకర్త కోసం ఇప్పటి నుంచే గాలిస్తున్నారట. అయితే... ఆయన ప్రశాంత్ కిశోర్ కోసం మాత్రం కాదు. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తమ రాజకీయ ప్రత్యర్థి వైసీపీకి పనిచేయడంతో ఆయన ఎంతమాత్రం ఆప్షన్ కాకుండాపోయారు. దీంతో ప్రశాంత్ కిశోర్ ని మించిపోయే వ్యూహకర్త కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. భారత దేశంలో అలాంటి అవకాశం లేకపోవడంతో విదేశాలకు చెందిన స్ట్రాటజిస్ట్ లపై చంద్రబాబు కన్నుపడినట్లు సమాచారం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం 2024లో కాకుండా బాగా ముందుగానే ఎన్నికలు వస్తాయని అంతా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిని ఉండడంతో మొత్తం క్షేత్ర స్థాయి నుంచి నిర్మించుకుంటూ రావాల్సి ఉంది. ఇందుకు చాలా సమయం పడుతుంది.. చాలా ఆలోచనలు - వనరులు - కొత్తఎత్తుగడలు - వ్యూహాలు అవసరం అవుతాయి.
పార్టీలోని సీనియర్లు - తన మనషులనే ఎప్పటిలా నమ్ముకుంటే తన మెప్పు కోసం.. తన ముఖస్తుతి కోసం వాస్తవాలు తనకు తెలియకుండాచేసే ప్రమాదముందని.. అలా చేయడం వల్లే 2019లో దెబ్బయ్యామని చంద్రబాబుకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందట. దాంతో...పూర్తిగా ప్రొఫెషనల్ గా పనిచేసే విదేశీ ఎన్నికల స్ట్రాటజిస్టులను నియమించుకుని... వారికి స్థానిక మేధావులు - వ్యూహకర్తల సహకారం అందిస్తూ ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా ఎన్నికల వ్యూహాలు రచించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రశాంత్ కిశోర్ ను తలదన్నేలా ఇంటర్నేషనల్ వ్యూహకర్తలను దించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం హార్వార్డ్ యూనివర్శిటీ పొలిటికల్ కన్సల్టెంట్ - 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కోసం పనిచేసిన స్టీవ్ జార్డింగ్ ను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
హార్వార్డ్ స్కూల్ లో పబ్లిక్ పాలసీని బోధించే స్టీవ్ జార్డింగ్ కు ఇటీవల అక్కడ ఉద్వాసన పలికారు. ఆయన్ను పంపించకూడదంటూ అక్కడి విద్యార్థులు ఆందోళనలు కూడా చేశారు. జార్డింగ్ 1980 నుంచి ప్రచారకర్తగా - మేనేజర్ గా - పొలిటికల్ కన్సల్టెంట్ గా - వ్యూహకర్తగా పలువురికి సేవలందించారు. ఆయన క్లయింట్ల జాబితాలో స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్ - అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోరె వంటి వారెందరో ఉన్నారు.