పచ్చ బ్యాచ్ సరికొత్త మైండ్ గేమ్ మొదలెట్టింది. చంద్రబాబు ఇమేజ్ ను ఆకాశానికి ఎత్తేసేందుకు వీలుగా అంకెలతో ఆడుకోవటం షురూ చేశారు. బాబు ఛరిష్మా.. అభివృద్ధి నమూనా.. హార్డ్ వర్క్.. డెడికేషన్ అంటూ చెప్పే రొడ్డుకొట్టుడు మాటలకు తోడుగా కొన్ని గణాంకాల్ని సిద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. విపక్ష నేతల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాన్ని షురూ చేశారని చెప్పాలి.
తాజా ప్లాన్ ఏమిటంటే.. ఏపీ సీఎం చంద్రబాబు సీక్రెట్‌గా సర్వే చేయించుకున్నారని.. తాజా అంచనాల ప్రకారం బాబు మీద ఏపీ ప్రజల ఆదరణ మామూలుగా లేదని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. గెలిచే సీట్లకు కొదవ ఉండదని చెబుతున్నారు. ఈ మధ్యన జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లోనూ.. కాకినాడ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలకు ధీటుగా రిజల్ట్ వస్తాయన్న మాటను చెబుతున్నారు. 2018 డిసెంబరులో కానీ ఎన్నికలు నిర్వహిస్తే.. బాబుకు మరోసారి పట్టాభిషేకం ఖాయమంటూ సదరు సర్వే పేర్కొనటం గమనార్హం.
తాజాగా బాబు చేయించారని చెబుతున్న సర్వే ఫలితాల ప్రకారం.. టీడీపీకి తిరుగులేని అధిక్యతను కట్టబెట్టేందుకు ఏపీ ప్రజలు తహతహలాడుతున్నట్లుగా అంకెలు ప్రచారమవుతున్నాయి. టీడీపీకి 57 శాతం ఓట్లతో 139 సీట్లతో ఘన విజయం సాధిస్తారని.. అదే సమయంలో ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన రీతిలో కేవలం 24 శాతం ఓట్లతో 28 సీట్లు.. జనసేన 10 శాతం ఓట్లతో 9 సీట్లు గ్యారెంటీ అని చెబుతున్నారు.
ఈ సర్వేను దేశంలోనే మొనగాడు లాంటి సర్వే ఏజెన్సీతో చేయించారన్న మాటతో పాటు మాజీఎంపీ చేపట్టే సర్వే సంస్థ సాయంతోనే తాజా ఫిగర్లను ఫైనల్ చేసినట్లుగా ప్రచారం చేసుకోవటం కనిపిస్తుంది. ఢిల్లీ.. నొయిడా నుంచి వచ్చిన ఈ సర్వే సంస్థ ప్రతినిధులు ఏపీలోని 13 జిల్లాల్లోనూ సర్వే చేశారని చెబుతున్నారు. సర్వేలో వయసుల వారీగా.. విద్యార్హత వారీగా డేటాను సమకూర్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరీ ప్రచారంలో నిజం ఎంతన్నది చూస్తే.. బీజేపీకి ఒక్క సీటు కూడా లేదన్నట్లు చూపించటం గమనార్హం.
ఈ పైత్యం లెక్కల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. చంద్రబాబు.. జగన్ లు ప్రాతినిధ్యం వహించే జిల్లాల్లో కడప జిల్లాలో జగన్ ప్రత్యర్థి పార్టీదే పైచేయి అన్నట్లుగా ఫలితాలు ఉండటం గమనార్ఘం.
ఏపీని మూడు భాగాలుగా చేసి లెక్కలు వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే..
రాయలసీమ (52 అసెంబ్లీ స్థానాలు).. (తెలుగుదేశం 41 వైసీపీ 10 - జనసేన 1)
జిల్లాల వారీగా చూస్తే..
+ చిత్తూరు(మొత్తం స్థానాలు 14): టీడీపీ 11.. వైఎస్సార్ కాంగ్రెస్ 3
+ కడప (మొత్తం స్థానాలు 10): టీడీపీ 7.. వైఎస్సార్ కాంగ్రెస్ 3
+ అనంతపురం (మొత్తం స్థానాలు 14): టీడీపీ 11.. వైఎస్సార్ కాంగ్రెస్ 2.. జనసేన 1
+ కర్నూలు: (మొత్తం స్థానాలు 14).. టీడీపీ 12.. వైఎస్సార్ కాంగ్రెస్ 2
కర్నూలు (14) తెదేపా 12, వైసీపీ 2
ఉత్తరాంధ్ర (33 అసెంబ్లీ స్థానాలు).. (తెలుగుదేశం 24.. వైఎస్సార్ కాంగ్రెస్ 8.. జనసేన 1)
- శ్రీకాకుళం (మొత్తం స్థానాలు10): టీడీపీ 7.. వైఎస్సార్ కాంగ్రెస్ 3
- విజయనగరం ( మొత్తం స్థానాలు 9): టీడీపీ 6.. వైఎస్సార్ కాంగ్రెస్ 3
- విశాఖ జిల్లా (మొత్తం స్థానాలు 14): టీడీపీ 11... తెదేపా 11, వైసీపీ 2.. జనసేన 1
కోస్తా (89 అసెంబ్లీ స్థానాలు).. ( తెలుగుదేశం 72.. వైఎస్సార్ కాంగ్రెస్ 10.. జనసేన 7)
= తూర్పు గోదావరి (మొత్తం స్థానాలు 19): తెలుగుదేశం 14.. వైఎస్సార్ కాంగ్రెస్ 2.. జనసేన 3
= పశ్చిమగోదావరి (మొత్తం స్థానాలు 15): తెలుగుదేశం 12.. వైఎస్సార్ కాంగ్రెస్ 1.. జనసేన 2
= కృష్ణా (మొత్తం స్థానాలు 16): తెలుగుదేశం 14.. వైఎస్సార్ కాంగ్రెస్ 1.. జనసేన 1
= గుంటూరు (మొత్తం స్థానాలు 17) తెలుగుదేశం 15.. వైఎస్సార్ కాంగ్రెస్ 2
= ప్రకాశం (మొత్తం స్థానాలు 12) తెలుగుదేశం 9.. వైఎస్సార్ కాంగ్రెస్ 2.. జనసేన 1
= నెల్లూరు (మొత్తం స్థానాలు 10): తెలుగుదేశం 8.. వైఎస్సార్ కాంగ్రెస్ 2
* ఈ గణాంకాల్ని చూస్తే.. బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోదా?
* సీమ.. ఉత్తరాంధ్రలో పవన్ కేవలం రెండు సీట్లను మాత్రమే ప్రభావితం చేయటమా?
* బీజేపీ స్థానాన్ని జనసేన అధిగమించిందన్నట్లు చూపించటం
* జగన్‌కు బలమైన కడపలో ఆ పార్టీని కేవలం 3 స్థానాలకు పరిమితం చేయటం
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే కర్నూలు.. ప్రకాశం.. నెల్లూరు జిల్లాల్ని బాబు ఖాతాలోకి వేయటం
బాబు బ్యాచ్ వైరల్ చేస్తున్న తాజా సర్వే లెక్కలు చూసినప్పుడు కనిపించేది ఒక్కటే. అంకెల్లో ఆనందం వెతుక్కోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపించక మానదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను వ్యాప్తి చెందేలా చేయాలన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే.. అంకెలు ఎవరు ఎలా చూస్తే అలా కనిపిస్తాయన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు అవగాహన ఉండకపోవచ్చు. కానీ.. ఎవరి జిల్లా వారికి అర్థం కావటంతో పాటు పక్క జిల్లా మీద కూడాఎంతో కొంత అవగాహన ఉంటుంది. అలా చూస్తే.. తెలుగు తమ్ముళ్లు కొందరు వైరల్ చేస్తున్న ఈ సర్వే లెక్కల్లో నిజం ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.