నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా - ప్యాకేజీ విషయంలో ఢిల్లీలో కేంద్రం కసరత్తు చేస్తున్న విషయంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు మీద చర్చలు జరుగుతున్నాయి. తాజాగా హోదా రాజకీయాలు ఢిల్లీ నుంచి తెలుగు నేలపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు - సీఎం చంద్రబాబుల మధ్య కీలక భేటీ జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే పొత్తు వదులుకోవడానికి కూడా రెడీ అని చంద్రబాబు కుండబద్ధలు కొట్టడంతో హోదాపై కేంద్రం కసరత్తు పెంచినట్లు చెబుతున్నారు.
ఈ విషయంలో నిన్నంతా అమిత్ షా - జైట్లీ - వెంకయ్యనాయుడు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే వచ్చే సమస్యలేంటి..? అన్న అంశంపై చర్చించారు. ప్రధాని మోడీని వెంకయ్యనాయుడు ఈరోజు కలిసి దీనిపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అనంతరం అరుణ్ జైట్లీతోనూ వెంకయ్య సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాపై ఒక నిర్ణయానికి వచ్చిన మోడీ..దానిపై ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా చర్చించాలని భావించి ఆ బాధ్యత వెంకయ్యకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫోన్ లో చంద్రబాబుతో మాట్లాడిన వెంకయ్య హైదరాబాద్ రావాలని చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కూడా హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం.
చంద్రబాబు అసంతృప్తి - ఇటీవల తిరుపతిలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ ప్రత్యేక హోదాపై ఏపీకీ ఏదో ఒకటి చేయాలని లేకపోతే నష్టపోతామని గుర్తించి నష్టనివారణ చర్యలకు తెర తీస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి వీలైనంత తొందర్లో ఏం చేయబోతున్నామో తెలిపే రోడ్ మ్యాప్ తయారు చేసే పనిలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు - వెంకయ్య మధ్య సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఈ వారంలోనే ఏపీకి ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యపై అనేక విమర్శలు వస్తున్న సమయంలో ఆయనకే ఈ బాధ్యతలు అప్పగించడంపైనా వ్యతిరేకత వస్తోంది.