ఈ మధ్య కాలంలో తరచూ తాను మాట్లాడే మాటలతో వివాదాల్లోకి కూరుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా అలాంటి అవకాశాన్ని తన రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చారా? అంటే అవునని చెప్పాలి. సిద్ధాంతాల పరంగా ఏ మాత్రం పొసగని వారిపై ప్రశంసల జల్లు కురిపించిన బాబు మాటలు ఆసక్తికర చర్చకు తావిస్తాయనటంలో సందేహం లేదు. తాజాగా అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బాబును తప్పు పట్టేలా ఉండటమే కాదు.. విమర్శలకు అవకాశం ఇచ్చినట్లైందన్న మాట వినిపిస్తోంది.
భారత ప్రధానిగా ఇందిర పోషించిన పాత్ర అసమాన్యమైనదని పొగిడేశారు. ఇందిరమ్మ విధానాలన్నా.. కాంగ్రెస్ పొడ అన్నా గిట్టని ఎన్టీఆర్.. ఆ పార్టీ మీదున్న వ్యతిరేకతతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన జీవితంలో కాంగ్రెస్ ను ఎంతమాత్రం మెచ్చుకోని ఎన్టీఆర్ తీరుకు భిన్నంగా బాబు మాటలు ఉండటం గమనార్హం.
దేశానికి శాపమైన అత్యవసర పరిస్థితిని విధించి.. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన వైనం ఇప్పటికి కాంగ్రెస్ ను వెంటాడుతుంటే.. ఆ విషయంపై ఇప్పటికీ కాంగ్రెస్ దేశానికి క్షమాపణలు చెప్పకుండా మాట తప్పిస్తున్న విషయాన్ని బాబు మర్చిపోయినట్లున్నారు. మహిళాశక్తిని ప్రత్యేకంగా ప్రశంసించాలంటే జాతీయ స్థాయిలో ఎంతమంది మహిళలు లేరు? కానీ.. ఆ విషయాన్ని వదిలేసి.. ఇందిరను పొగిడేయటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పార్టీ వ్యవస్థాపకుడి భావజాలానికి పూర్తి భిన్నంగా వ్యవహరించిన బాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/