ఏపీ సీఎం చంద్రబాబు పనితీరు కాస్త డిఫరెంటుగా ఉంటుంది... నివేదికలు - సర్వేలు - అధ్యయనాలు - మదింపులు - పనితీరు అంచనాలు వంటివాటికి ఆయన బాగా ప్రాధాన్యమిస్తారు. అధికారులు - ఎమ్మెల్యేలు - మంత్రులనూ ఆయన ఈ పరిధిలోకి తెచ్చారు. ఇప్పటికే ఆయన పలుమార్లు మంత్రులు - ఎమ్మెల్యేల పెర్మాన్సెన్సుపై రిపోర్టులు తయారుచేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఇంతవరకు వచ్చిన నివేదికలన్నీ ఒకెత్తయితే తాజాగా మంత్రులు - ఎమ్మెల్యేలకు వచ్చిన ర్యాంకింగులు ఒకెత్తు. ఈసారి ఓడలు బళ్లయ్యాయి... బళ్లు ఓడలయ్యాయి. చంద్రబాబుకు బాగా క్లోజ్ అనుకున్నవారు - ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనుకున్నవారు వెనకబడిపోయారు... సరిగా పనిచేయడం లేదని ప్రచారం జరుగుతున్న మంత్రులు కొందరు ముందుకొచ్చారు. ఈ సర్వేకు తీసుకున్న నాలుగు ప్రతిపాదికల ఆధారంగా పరిశీలిస్తే ర్యాకింగులు ఒకరకంగా ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. మహా మంత్రులు అనుకున్నవారు లాస్టు ప్లేసుల్లోకి వెళ్లిపోవడం వెనుక కారణాలు అన్వేషిస్తే రాజకీయ కారణాలతో పాటు అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
బాబు సర్వేలు చేయిస్తారని.. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారని అందరికీ తెలుసు.. అయితే.. చాలావరకు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లోని డాటా సెంటర్, ఇతర టీడీపీ అనుబంధ స్పెషల్ టీంలపై దీనికోసం ఆధారపడేవారు. ఇంతకాలం దాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నేతలు మాయ చేసేవారు. చంద్రబాబు నివేదికలు అనగానే ఈ డాటాసెంటర్ లోని ముఖ్యులను - ప్రత్యేక టీంల్లోని వారని మేనేజ్ చేసి తమకు అనుకూలంగా చంద్రబాబుకు రిపోర్టు వెళ్లేలా చేయగలిగేవారు. ఇందుకోసం డబ్బు - పనులు - ఇతర మార్గాలు అనుసరించేవారట. ఈ టాలెంటు లేనివారు వెనుకబడిపోయి చంద్రబాబు వద్ద తిట్లు తినేవారు. కానీ, కొద్దికాలం కిందట ఈ సంగతి చంద్రబాబుకు చేరింది. దీంతో ఆయన ఈసారి మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరు సర్వే కోసం ప్రయివేటుసంస్థ సేవలను ఉపయోగించుకున్నారు. సో.... ఇంతకాలం మేనేజ్ చేసి బడా మంత్రులు బుక్కయిపోయారు. కొందరైతే ఇప్పుడొచ్చిన సర్వే తప్పులతడక అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. టీడీపీ వర్గాలు మాత్రం ఈ నివేదికలో అంశాలు నిజమని అంటున్నారు.