తెలుగు రాష్ట్రాల చరిత్రలో 2016 విజయదశమి ప్రత్యేకంగా నిలిచిపోయేలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సాహంగా ముందుకువెళుతున్నారు. అయితే అదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం మరో ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. విజయదశమి రోజున వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం సుముహూర్తంలో లాంఛనంగా సచివాలయంల ప్రారంభోత్సవం నిర్వహిస్తే మంచిదని పండితులు సూచించినట్లు తెలిసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ షాపోర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తున్న సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తును సీఎం కార్యాలయానికి నిర్దేశించారు. అదే బ్లాక్ కింది భాగంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్ ల కోసం నిర్మిస్తున్నారు. రెండు నెలల కిందటే సీఎం కార్యాలయం పూర్తయింది. వాస్తు - భద్రతా కారణాల రీత్యా తిరిగి కార్యాలయానికి సరికొత్త హంగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం నిర్మితమైన భవనాన్ని పూర్తిస్థాయిలో తిరగదోడుతున్నారు. ముఖ్యమంత్రి - ఉన్నతాధికారుల ప్రతిపాదనల మేరకు విదేశీ అలంకారాలతో పాటు ఇటాలియన్ బ్రిక్స్ తో ఫ్లోరింగ్ తదితర పనులు చేపట్టారు. ఎక్కడికక్కడ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు - సమావేశాలకు అనువుగా ఉండే వసతులు - సందర్శకుల లాబీ - తదితర వసతుల కోసం అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించే విధంగా సీఎం కార్యాలయం నిర్మాణం జరగాలంటే మరో నెలరోజుల పైనే వ్యవధి పడుతుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈలోపు శాసనసభ నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా విజయదశమి పర్వదినం రోజున కార్యాలయాన్ని ప్రారంభిస్తే శుభసూచకం కనుక సీఎం ఒకటో బ్లాక్ ను ఆరోజు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/