ఎంతసేపటికి ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటం.. లేదంటే.. తన గొప్పతనం గురించి అదే పనిగా చెప్పుకునే అలవాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కువే. తన వ్యక్తిగత విషయాలు.. తన మనసులోని మాటల్ని ఆయన బయటపెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు. ఆ మాటకు వస్తే.. ఆయన ముఖం మీదన నవ్వే ఉండదు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగా బాబు బిహేవియర్ లో కాస్త మార్పు వచ్చిందని చెప్పాలి. ముఖానికి గంటు పెట్టుకున్నట్లుగా సీరియస్ గా ఉండే బాబును అంతో ఇంతో మార్చి.. జోకులు వేయటం.. సరదాగా మాట్లాడటం లాంటివి నేర్పించింది వైఎస్సేనే చెప్పాలి.
నీ ముఖాన నవ్వే ఉండదంటూ బాబు ముఖం మీదనే చెప్పిన వైఎస్ పుణ్యామా అని చంద్రబాబు తనను తాను చాలానే మార్చుకున్నరు. నవ్వటమే కాదు.. అప్పుడప్పుడు ఆసక్తికర విషయాలు చెప్పటం మొదలుపెట్టారని చెప్పాలి. తాజాగా ఆయన ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పారు.
అసలు చంద్రబాబు రాజకీయాల్లోకి రాకుంటే ఏమయ్యేవారు? అన్న ప్రశ్నను సంధించుకుంటే.. సమాధానం దొరకదు. తాజాగా ఆ ప్రశ్నకు తనకు తానే సమాధానం చెప్పుకున్నారు బాబు. తాను కాలేజీలో చదివే రోజుల్లో ఐఏఎస్ కావాలని అనుకున్నానని.. కానీ అలా కావటం కష్టమనిపించిందట.
దీంతో.. ఐఏఎస్ కావాలన్న ఆలోచనపక్కన పెట్టి.. అదే ఐఏఎస్ లను కంట్రోల్ చేసే స్థాయికి రావాలంటే రాజకీయాల్లోకి వస్తే మాత్రమే ఆపని చేస్తామన్న భావనలో పాలిటిక్స్ లోకి వచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా అయితే తాను సాధించలేని ఐఏఎస్ పోస్టులో ఉన్న వారిని నియంత్రించొచ్చని భావించానని.. ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పారు. మొత్తానికి బాబు గోల్స్ మామూలుగా లేవుగా.?