పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అనుకున్న రీతిలో పాలన సాగకపోవటం.. ప్రభుత్వానికి రావాల్సిన మంచిపేరు రాకపోవటం.. రాష్ట్రంలో పార్టీకి.. ప్రభుత్వానికి సానుకూలత మిస్ అయ్యిందన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబులో అసహనం అంతకంతకూ పెరిగి పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం చేకూరేలా ఆయన మాటలు ఉన్నాయని చెబుతున్నారు.
తాజాగా అమరావతిలోని తన నివాసంలో మంత్రులు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు.. ముఖ్య నేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేత వైఖరిపై తనలోని అసంతృప్తిని పూర్తి స్థాయిలో చంద్రబాబు బయటపెట్టినట్లుగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. ఈ సారి ఆయన వాయిస్ కరుగ్గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనను ఎవరైనా వేలెత్తి చూపిస్తున్నారంటే అది కచ్ఛితంగా ఎమ్మెల్యేల తీరు కారణంగానేనని.. వారంతా తమ తీరును మార్చుకోవాలని స్పష్టంగా చెప్పినట్లు చెబుతున్నారు.
ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు మాటలు అనునయంగా ఉంటాయని.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా కరకుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీలు.. ఎమ్మెల్యేలందరిని లైన్లో పెట్టేందుకు వీలుగా తాజాగా ఆయన నోటి నుంచి గ్రేడింగ్స్ మాటలు వచ్చాయని చెబుతున్నారు.
బీ గ్రేడ్ వచ్చే వారికి కౌన్సెలింగ్ తప్పదని స్పష్టం చేసిన చంద్రబాబు.. సీ గ్రేడ్ వచ్చిన వారిని మాత్రం పక్కన పెట్టేయటం తప్పనిసరి అని తేల్చేసినట్లుగా తెలిసింది. పార్టీ నేతల తీరు ఆధారంగానే వారికిచ్చే టిక్కెట్లు ఆధారపడి ఉంటాయని చెప్పినట్లుగా సమాచారం.
రెండేళ్లలో జరిగే ఎన్నికలకు సంబంధించి.. టిక్కెట్ల కేటాయింపు గురించి ఇప్పుడే ఇంత స్పష్టంగా చంద్రబాబు నోటినుంచి రావటం పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. బాబు నోటి నుంచి వచ్చిన టిక్కెట్ల వార్నింగ్ పార్టీ నేతల్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/