అవసరం మేరకు తన పార్టీలోని నేతలను ఇతర పార్టీల్లోకి పంపడం కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేసే పనే అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలోని కొన్ని ఉదాహరణలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తన పార్టీ రాజ్యసభ సభ్యులను ఇప్పుడు బీజేపీలోకి పంపించారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. తన పార్టీ మనుగడ కష్టం అయినప్పుడు చంద్రబాబు నాయుడు తన వారిని ఇతర పార్టీల్లోకి పంపించడానికి కూడా వెనుకాడే టైపు కాదని ఇది వరకే స్పష్టం అయ్యింది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పుడే చంద్రబాబు నాయుడు తీరు సర్వత్రా చర్చనీయాంశంగా నిలిచింది. చంద్రబాబు నాయుడు ఆశీస్సుల మేరకే అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత అదే నిజం అని తేలింది. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు రాజీకి వెళ్లడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలా చంద్రబాబు నాయుడు ముందుగా తన పార్టీ నుంచి నేతలను కాంగ్రెస్ లోకి పంపి.. వారి ద్వారా కాంగ్రెస్ తో దోస్తీ చేశారు. ఆ దోస్తీకి ఏం ఫలితం దక్కింది అనేది వేరే కథ.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ కష్టకాలంలో పడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఎరగని స్థాయి ఓటమిని ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి నేపథ్యంలో ఆయన తన పార్టీ మనుగడ కోసం కష్టాలు పడే పరిస్థితి దాపురించింది. ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనుకున్నది వేరు, ఫలితాల్లో వెల్లడి అయ్యింది వేరు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో మరోవైపు కేంద్రంలో.. అంతటా చంద్రబాబు నాయుడు శత్రవులుగా భావించే వాళ్లే అధికారంలో ఉన్నారు. మోడీ మీద చంద్రబాబు నాయుడు ఒకరేంజ్లో ఫైర్ అయ్యారు. దీంతో ఆయన చంద్రబాబు ను ఒక చూపు చూసే అవకాశాలున్నాయి. తట్టుకోవడానికి రాష్ట్రంలో అధికారం చేతిలో లేదు. తెలంగాణలోనూ దిక్కులేదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడే వ్యూహాత్మకంగా ఎంపీలను బీజేపీలోకి పంపించారని అంతా అనుకుంటున్నారు.
ఈ విషయాన్ని వెళ్లిపోయిన ఎంపీలు కూడా ధ్రువీకరిస్తూ ఉన్నారు. తాము చంద్రబాబుకు చెప్పే బీజేపీలోకి చేరుతున్నట్టుగా వారు తేల్చేశారు. వారం కిందటే చంద్రబాబుకు సమాచారం ఇచ్చామని వారు అంటున్నారు. వారు చెప్పినా చంద్రబాబు నాయుడు తన మానాన తను విదేశాలకు వెళ్లిపోయారు. ఇక్కడే ఉంటే ఉండి కూడా ఏం చేయలేదనే అపవాదు రాకుండా, చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లాడనే మాట రాకుండా, చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లిపోయినట్టుగా స్పష్టం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్కెచ్ ప్రకారమే ఎంపీల ఫిరాయింపు జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.