ఏం చేస్తే రూ.510 కోట్ల ఆస్తులు? గుడివాడ సభలో సీఎం జగన్ కు బాబు క్వశ్చన్
జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ.. ఆయన్ను టార్గెట్ చేస్తున్న విపక్ష తెలుగు దేశం ఒకే సమయంలో రెండు భారీ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు.. ''ఇదేం ఖర్మ రాష్ట్రానికి'' అంటూ వివిధ ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేస్తూ.. జగన్ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు.. పార్టీ కీలక నేతల్లో ఒకరు చంద్రబాబు తర్వాతి స్థానంలో ఉన్నట్లుగా చెప్పే నారా లోకేశ్.. 'యువగళం' పేరుతోపాదయాత్ర నిర్వహిస్తుండటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తాజాగా ఆయన గుడివాడలో రోడ్ షో నిర్వహించి..అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పైనా.. ఆయన పాలనపైనా విమర్శలు సంధించారు. కోడికత్తి డ్రామాను జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆడారని.. అందుకు తమ పార్టీకి సంబంధం ఉందని ఆరోపించారన్నారు. 'కోడికత్తి ఒక నాటకం అని నేను అప్పుడే చెప్పాను.
ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఇదే తేల్చింది. నిందితుడు శ్రీనివాస్ వైసీపీ వ్యక్తేనని.. అయినా కోడికత్తితో ఎవరైనా హత్య చేయగలరా? అని ప్రశ్నించారు. శుక్రవారం వస్తే చాలు.. ఏ ఇంటి ముందు పొక్లెయిన్ ఉంటుందో తెలీదని.. ఎవరి ఇంటి ముందు పోలీసులు కాపు కాసి అరెస్టులు చేస్తారో తెలీదన్నారు. 'అంతా రౌడీ రాజ్యంగా మారింది. హైదరాబాద్ కంటే మెరుగైన నగరం కోసం అమరావతి అంటే అందరు సంతోషించారు. గొప్ప నగరం నిర్మించాలని బావిస్తే సైకోకు అది గిట్టలేదు. మూడు రాజధానులు అంటూ మూడుముక్కలాట ఆడారు. వారిని చిత్తుచిత్తుగా ఓడించాలి' అని పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు సానుభూతి కోసం పీకే ఆడించిన గొప్ప నాటకంలో జగన్మోహన్ రెడ్డి.. కోడికత్తి కమల్ హాసన్ గా మిగిలిపోయారన్నారు. బాబాయ్ పై గొడ్డలి వేటు ద్వారా సానుభూతి సంపాదించి ప్రజలను మోసం చేసిన ఘనత జగన్ దేనని విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కుటుంబ ఆస్తుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైఎస్ ముఖ్యమంత్రి కాక ముందు 2004లో జరిగిన ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం వైఎస్ ఆస్తులు రూ.1.7 కోట్లుగా గుర్తు చేవారు.
'ఆ రోజున వైఎస్సార్ కుటుంబ ఆస్తి రూ.1.7కోట్లు. ఇప్పుడున్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తి రూ.5.5 కోట్లు అయితే.. ఒక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తి అంతకంటే ఎక్కువగా ఉందన్నారు. టీవీలు.. పేపర్లు లేవని చెప్పే నిరుపేద జగన్ ఏం చేసి రూ.510 కోట్లు సంపాదించారో చెప్పాలి. బటన్ నొక్కి పంచటం కాదు.. బొక్కటం ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆస్తుల్ని సంపాదించారు' అని మండిపడ్డారు.
వైసీపీ సైకోలను భూమి మీదకు దించాలన్నా.. ఏపీకి పట్టిన దరిద్రాన్ని వదిలించాలన్నా.. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. ''151 సీట్లు.. వైనాట్ 175 అంటూ విర్రవీడి ఆకాశంలో విహరించిన సైకో సీఎంను ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేలకు తీసుకొచ్చామన్నారు. పులివెందులలోనూ టీడీపీ జెండా ఎగురవేశామన్న సంతోషాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.