మీరు జంతుప్రేమికులా.. అయితే దీన్ని చదవొద్దన్నది మా మనవి
ఫుట్ బాల్ క్రీడ కోసం ఏకంగా 30 లక్షల వీధి కుక్కుల్ని అత్యంత కిరాతకంగా చంపేశారు.
మీరు జంతు ప్రేమికులా? అయితే.. ఈ వార్తను చదవొద్దనే చెబుతాం. మీ మనసుల్ని తీవ్రంగా గాయపర్చటమే కాదు అంతులేని విషాదంలోని దింపే ఈ కిరాతకం గురించి మీకు తెలీయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే.. ఒక క్రీడ కోసం లక్షలాది మూగజీవాల్నిదారుణంగా చంపేసిన దుర్మార్గంగా దీన్ని చెప్పాలి. ఫుట్ బాల్ క్రీడ కోసం ఏకంగా 30 లక్షల వీధి కుక్కుల్ని అత్యంత కిరాతకంగా చంపేశారు.
ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన దేశం మరేదో కాదు.. మొరాకో. ఈ దేశంలో స్పెయిన్.. పోర్చుగల్ తోకలిసి ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించనుంది. దీంతో.. ఈ మెగా టోర్నీకి అవసరమైన సన్నాహాల్ని భారీగా చేపట్టింది. ఈ క్రమంలో వీధి కుక్కల బెడదను తప్పించేందుకు దుర్మార్గమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు 30 లక్షలకు పైగా వీధి కుక్కల్ని నిర్మూలించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా వాటికి విష పదార్థాలు ఇవ్వటం.. కాల్చిచంపటం.. ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టటం ద్వారా చంపేయటం షురూ చేశారు. ఇంతటి కిరాతకంగా మూగజీవాల్ని పొట్టన పెట్టుకుంటున్న వైనం గురించి తెలిసిన వారంతాతీవ్రంగా వేదన చెందుతున్నారు. ఇక.. జంతుప్రేమికులైతే తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ప్రపంచ జంతు ప్రేమికుల గుండెలు మండేలా చేసిన ఈ దుర్మార్గం మీద అగ్రరాజ్యాలు ఏం చేస్తున్నట్లు?