గురివింద గింజ కింద నల్లగా ఉండే సామెత చంద్రబాబుకి వర్తిస్తుందా?

Update: 2020-06-11 14:30 GMT
‘గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదు’ అనే సామెత తెలుగునాట ఎంతో పాపులర్. దానర్థం ఏంటంటే.. ఎవరైనా గొప్పలు చెప్పుకొని ఎదుటివాళ్లను అవమానించే వాళ్లని గురువింద గింజలతో పోలుస్తారు. తన యవ్వారమే బాగా లేకున్నా ఏదో నీతిమంతుడిగా పదిమందికి హితబోద చేసేవారిని ఇలా నిందిస్తుంటారు.

ఇప్పుడు ఈ గురువింద గింజ ఎందుకు గుర్తుకు వచ్చిందంటే.. మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కథ చూస్తుంటే ఆ గురువింద గింజలే గుర్తుకువస్తున్నాయట.. చంద్రబాబు తాజాగా ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖ చూశాక అందరూ అదే అంటున్నారు.

చంద్రబాబు లేఖలో ఏం రాశారంటే.. ‘ప్రలోభాలకు గురిచేస్తూ టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను లోబరుచుకుంటున్నారని’ వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తవ్విచూస్తే చంద్రబాబు గారి నీతి నిజాయితీ బయటపడుతుందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో  ఏకంగా నాటి ప్రతిపక్ష వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా లాగేసుకొని అందులోని కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు చంద్రబాబు గారు.  కానీ ఇప్పుడు సీఎం జగన్ మాత్రం ఏ టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీనైనా రాజీనామా చేశాకే తన పార్టీలోకి తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఇలాంటి నీతి నియమాలు ఏం పెట్టుకోకుండానే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు..

తాజాగా తన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేస్తుంటే కడుపుమండిన చంద్రబాబు వైసీపీపై ఆగ్రహిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు చేసిందే సంసారమని.. పక్కోళ్లు మంచిగా చేసినా అది వ్యభిచారమని ఆరోపిస్తున్న వైనం కనిపిస్తోంది. ఇదే గురివింద గింజ నీతి అని వైసీపీ శ్రేణులు బాబును ఆడిపోసుకుంటున్నారు..
Tags:    

Similar News