ఇది విన్నారా.? సాగుపై బాబు ప్రసంగమట..

Update: 2018-08-30 07:41 GMT
అది 2004కు ముందు.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలన.. వ్యవసాయం దండగ అన్న పెద్ద మనిషి ఆయన.. వరుస కరువు నెలకొంది. సాగుకు కరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులను బషీర్ బాగ్ లో తూటలతో చంపేసిన నెత్తుటి చరిత్ర ఆయన సొంతం.. రైతులు, కమ్యునిస్టు నేతలపై తూటాలు పేల్చిన దెబ్బకు ఆయన్ను రెండు సార్లు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అప్పటికీ కానీ బాబు కు తత్వం బోధపడలేదు. ఇక పరిశ్రమలు వద్దు.. సాగు ముద్దు అంటూ వ్యవసాయం, రైతులు అంటూ చిలకపలుకలు పలికాడు. పోనీ బాబు మారాడని జనం నమ్మారు. బీజేపీతో పొత్తుతో 2014లో ఎలాగోలా గెలిచేశారు. కానీ ఆ తర్వాతే మళ్లీ బాబు మాట మార్చాడు. అమరావతి రాజధాని కోసం అంటూ మూడు పంటలు పండే భూముల్ని లాగేసుకొని సింగపూర్ కంపెనీలకు అప్పగించారు. సాగు వద్దు.. మనకు పారిశ్రామికీకరణ.. గొప్పగొప్ప భవంతులు ముద్దు అని ప్రకటించేశారు..

 రైతు పక్షపాతి చంద్రబాబు అంటూ కీర్తించడానికి రైతులే ముందుకు రాని పరిస్థితి ఏపీలో ఉందంటే అతిశయోక్తి కాదు.. హైటెక్ ‘బాబు’ ప్లాన్లు అలాంటి మరి.. ఎప్పుడు పరిశ్రమలు, పారిశ్రామికీకరణ.. కంప్యూటర్లు, ఆధునికం అంటూ సాగే బాబుకు సాగు గురించి పెద్దగా ఆసక్తి ఉండదని దగ్గరి నుంచి చూసిన వారంటారు..

ఇంత గొప్ప రైతు వ్యతిరేక వ్యక్తికి ఐక్యరాజ్యసమితి తాజాగా ఆహ్వానం పంపడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సెప్టెంబర్ 24న న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితిలో పాల్గొనేందుకు చంద్రబాబుకు ఆహ్వానం అందిందంటూ పచ్చమీడియా బీరాలు పలుకుతోంది. జీరో బడ్జెట్, ప్రకృతి సేద్యంలో ఏపీ ముందుకెళ్తున్న తీరును ఐక్యరాజ్యసమితి ప్రశంసిస్తూ ఆ సబ్జెక్ట్ పై ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం పంపిందట.. ఇప్పటికే రూపాయి లేదు.. నిధులు ఇవ్వండని బాబు కేంద్రాన్ని బాబు అడుక్కుంటుంటే.. జీరోబడ్జెట్ తో అద్భుతాలు చేస్తున్నాడని ఐక్యరాజ్యసమితి కితాబిస్తోంది. ఇదంతా నిజమేనా.? యూఎన్వో అసలు విషయాన్ని గ్రహించిందా.? లేక బాబు గారు ఏదో ‘మేనేజ్’ చేశారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

అప్పట్లో దావోస్ సదస్సుకు ఆహ్వానం అందితేనే పచ్చచొక్కాలు విప్పుకున్నారు. ఇప్పుడేమో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అంటూ భజన మొదలుపెట్టారు. వైసీపీ నేతలు మాత్రం ఈ ఆహ్వానం వెనుక 4.5 కోట్ల ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి బాబు గారు పాస్ తెచ్చుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదీ ఏమైనా చంద్రబాబు ఇలాంటి పాపులారిటీ కోసం ఏదైనా చేసే ఘనుడే అంటూ ప్రతిపక్ష వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News