బాబును లైట్ తీసుకుంటున్నారా?

Update: 2022-12-29 04:02 GMT
నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో సంభ‌వించిన దుర్ఘ‌ట‌న వెనుక‌.. ఏం జ‌రిగిందనేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. పార్టీ ప‌రంగా ఉన్న దూకుడును ప‌క్క‌న పెడితే.. గ‌తానుభ‌వా ల‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించాల్సిన తీరులో తేడా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. కేవ‌లం చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు మాత్ర‌మే ప్రాధాన్యం(అది కూడా ఆయ‌న కేంద్రానికి చెప్పాక‌) ఇస్తున్నారు.

ఇతర విష‌యాల‌పై పోలీసులు దృష్టి పెట్ట‌డం లేదు. దీంతో భారీగాత‌ర‌లి వ‌స్తున్న ప్ర‌జ‌లు, అభిమానుల‌కు ర‌క్ష‌ణ కొర‌వ‌డుతోంద‌నే వాద‌న తెరమీదికి వచ్చింది. గ‌తంలో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ..ఎన్నిక‌ల వాత‌వ ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో పార్టీల దూకుడు పెరిగింది. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు... స‌భ‌ల‌కు పిలిచేందుకు పార్టీలు దూకుడుగానే ఉన్నాయి. దీనిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

అయితే.. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ముందుగానే ఊహించి.. ప్ర‌జ‌ల‌ను అప్ర‌మత్తం చేయ‌డంతోపాటు.. పార్టీలకు దిశానిర్దేశం చేయాల్సిన పోలీసు యంత్రాంగం నిమిత్త మాత్రంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌ను ఇటీవ‌ల కాలంలో చాలా చాలా లైట్ తీసుకుంటున్నార‌నే వాద‌న ఉంది. నందిగామ ప‌ర్య‌ట‌న‌లో ఒక వ్య‌క్తి ఏకంగా కాన్వాయ్‌పై రాయి విసిరాడు.

ఈ ఘ‌ట‌నలో బాబు భ‌ద్ర‌తా సిబ్బంది చీఫ్ గాయ‌ప‌డ్డారు. మ‌రో ప‌ర్య‌ట‌న‌లో బాబు స‌భ‌లోకి వైసీపీ నాయ‌కులు చొర‌బ‌డి.. వ్య‌తిరేక నినాదాలు చేశారు. ఈ స‌మ‌యంలో బాబు సంయ‌మ‌నం పాటించ‌క‌పోయి ఉంటే ఇరు ప‌క్షాల మ‌ధ్య దాడులు జ‌రిగి ఉండేవి. ఇటీవ‌ల కాలంలో బాబు స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి స‌భ‌లు దీనికి ఉదాహ‌ర‌ణ‌.

ఇలాంటి స‌మ‌యంలో ఏదైనా జ‌రిగితే.. అనే విష‌యంపై పోలీసులు దృష్టి పెట్టి.. ఉంటే.. కందుకూరు ఘోరం జ‌రిగి ఉండేది కాద‌ని అంటున్నారు. మొత్తంగా బాబుదేముంది.. అనో.. లేక మ‌రే కార‌ణమో కానీ, చంద్ర‌బాబును లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే జ‌రిగింది. మ‌రి దీనిపై పోలీసులు ఏమంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News