యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కఠినమైన మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించింది. గంజాయి లోని ప్రధాన మత్తుపదార్థ రసాయనమైన టీసీహెచ్ ను తమ దేశంలోకి తీసుకొచ్చే వారికి విధించే శిక్షలను సవరించింది. ఇకపై గంజాయితో చేసిన ఆహారపదార్థాలు, పానీయాలు, ఇతర పదార్థాలను తమ దేశంలోకి తీసుకొస్తూ తొలిసారి పట్టుబడే వారికి జైలు శిక్ష ఉండదని తెలిపింది. అధికారులు మాత్రం ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని నాశనం చేస్తారని వెల్లడించింది.
దేశంలోకి గంజాయితో తయారుచేసిన ఆహారం, పానీయాలు, ఇతర వస్తువులను తీసుకువెళుతున్నప్పుడు పట్టుబడినా కూడా మొదటిసారైతే మాత్రం జైలులో పెట్టరు. అయితే, అధికారులు ఉత్పత్తులను జప్తు చేసి నాశనం చేస్తారు. గంజాయి నుంచి మాదక ద్రవ్యాలు, మత్తుమందులు మరియు యాంఫేటమిన్‌ల వంటి ఓవర్-ది-కౌంటర్ ఔషధాల వరకు వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే విషయంలో ప్రపంచంలోని అత్యంత నిర్బంధిత దేశాలలో ఒకటిగా యూఏఈ ఉంది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయంపై యూఏఈలో కఠినమైన ఆంక్షలు ఉండగా, డ్రగ్స్ అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్టు రుజువైనా నాలుగేళ్ల వరకు యూఏఈలో జైలు శిక్ష విధిస్తారు. పర్యాటకులు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన కాస్మోపాలిటన్ హబ్‌గా యూఏఈ తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున చట్టపరమైన సవరణ చేసింది.