ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన జగన్నాథ స్వామిని పస్తులతో ఉంచారు ఆలయ సిబ్బంది. తమతో తాము తగువ పడ్డ వారుస్వామి వారికి ఇవ్వాల్సిన నైవధ్యాన్ని వదిలేశారు. ఇది ఒకరోజు కాదు.. వరుసగా రెండు రోజుల పాటు సాగింది. అంతేనా.. స్వామివారికి నిత్యం అందించాల్సిన సేవల్ని వదిలేశారు.
దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారికి అందించాల్సిన ప్రసాదం అందించకుండా మహాపచారాలకు పాల్పడినట్లుగా పలువురు తప్పు పడుతున్నారు. స్వామికి అర్పించాల్సిన మహా ప్రసాదాన్ని అందించకపోవటంతో మంగళవారం దానిని భూమిలో పాతిపెట్టారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే స్వామివారికి అందించాల్సిన పురుషోత్తమ.. పవళింపు సేవల్ని నిలిపివేశారు. అధికార యంత్రాంగం.. సేవాయత్ లు (అర్చకులు) మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ దారుణాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయంలోకి వెళితే జగన్నాథ స్వామి ఆలయంలో మరమ్మతులు జరిగియా. అనంతరం గుడి గర్భగుడి ప్రధాన ద్వారా తలుపులు తెరవాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. నిర్ణీత వేళల్లో సేవలతో ప్రమేయం ఉన్న అర్చకులు మాత్రమే గర్భగుడిలో ఉంటారని.. మిగిలిన వారెవరూ లోపలకు వెళ్లకూడదని కోర్టు పేర్కొంది.
అయితే.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అధికారులు కట్టుబడి ఉన్నా.. అర్చకులు మాత్రం అందుకు భిన్నంగా సహాయ నిరాకరణ చేయటంతో స్వామివారికి అందాల్సిన ప్రసాదం అందలేదు. అంతేకాదు.. స్వామివారికి జరగాల్సిన సేవలకు విఘాతం చోటు చేసుకుంది. ఈ పరిస్థితికి రాష్ట్ర సర్కారు బాధ్యత వహించాలన్న విమర్శ పెరుగుతోంది. ఈ వ్యవహారం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. అధికార.. విపక్షాల మధ్య వాగ్వాదానికి కారణమైంది. అధికారులు.. ఆర్చకుల మధ్య వివాదం ఏమైనా.. కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో పూజించే దేవదేవుడి విషయంలో నిర్లక్ష్యం వహించటంపై మాత్రం పలువురు తప్పు పడుతున్నారు.