కరోనా కారణంగా అగ్రరాజ్యమైన అమెరికాకు టూరిస్టు వీసా మీద వెళ్లాలనుకునేవారికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. గడిచిన రెండేళ్లుగా పర్యాటకులకు వీసా జారీని ఆపేసిన వైనం తెలిసిందే. తాజాగా పరిస్థితులు చక్కబడుతున్న వేళ.. అమెరికాకు పర్యాటకం మీద వెళ్లాలనుకునే వారికి పరిమితులు ఎదురయ్యేవి.
పరిమిత సంఖ్యలో మాత్రమే వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. కరోనా వేళ.. వీసాల జారీని దేశంలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు.. కాన్సులేట్ కార్యాలయాలకు పరిమితం చేశారు.
తాజాగా ఆ విధానాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెప్టెంబరు నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. పర్యాటక వీసాలు (బీ1-బీ2) కోసం తొలిసారి దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. గతంలో వీసా మంజూరై.. కాలపరిమితి ముగిసిన తర్వాత వీసాల పునరుద్ధరణకు డ్రాప్ బాక్స్ విధానంలో అనుమతిస్తున్నారు.
ఇప్పుడున్న పద్దతిలో తొలిసారి పర్యాటక వీసా కోసం అప్లై చేసుకునే వారు దాదాపు 890 రోజులు అంటే.. రెండున్నరేళ్ల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సెప్టెంబరు నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియను హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ లోనూ మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ స్లాట్లను దశల వారీగా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
తొలిసారి అమెరికాను చూడాలనుకునే వారికి వీలుగా వెసులుబాటు ప్రకటించిన అమెరికా.. ఆ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించటానికి వీలుగా విద్యార్థులకు జారీ చేసే విద్యార్థి వీసా (ఎఫ్ 1) స్లాట్లను అందుబాటులోకి తేనున్నారు.
జూన్ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది మిషన్ ఇండియా ద్వారా 62 వేల మంది విద్యార్థులకు అమెరికా వీసాల్ని జారీ చేసింది. ఈసారి అంతకన్నా ఎక్కువ సంఖ్యలో జారీ అయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే వారి స్వప్నం కరోనా కారణంగా చెక్ పడితే.. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం వారి కలల్ని సాకారం కానుందని చెప్పక తప్పదు.